గద్వాల స్వేచ్ఛ: Lizard in Chutney: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లో అహ్మద్ టిఫిన్ సెంటర్ లో చట్ని లో బల్లి రావడంతో టిఫిన్ తిన్న వినియోగదారులు నలుగురు అస్వస్థతకు గురయ్యారు.హోటల్ నుండి టిఫిన్ పార్షిల్ తీసుకుని ఇంట్లో తింటుండగా చట్నీలో బల్లి కనపడటంతో, చట్నీ తిన్న భాధితులు వాంతులు వచ్చి శరీరమంతా చెమట రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు.
Also Read: Zaheerabad Crime: జెహీరాబాద్ లో దారుణం.. ఒంటరిగా ఉన్నమహిళపై దాడి.. ఆపై
కనీసం చట్నీ వేసేటప్పుడు అయినా కనీసం గుర్తించకపోవడం బాధాకరమని,ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి కస్టమర్లను ఇబ్బందులకు గురి చేసిన హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ భాధితులు తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందిన అనంతరం ఆరోగ్యం మెరుగవటంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.బాధితుల ఫిర్యాదు మేరకు టిఫిన్ సెంటర్ ను పరిశీలించిన పోలీసులు హోటల్ యజమానిని అదుపులోకి తీసుకుని, హోటల్ ను సీజ్ చేసినట్టు పట్టణ ఎస్సై కళ్యాణ్ రావు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు