Kamareddy District [ image credit: twittr]
తెలంగాణ

Kamareddy District: పండుగ పూట విషాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి.. ఎలాగంటే?

కామారెడ్డి స్వేచ్ఛ : Kamareddy District: ఉగాది పండుగపూట విషాదం నెలకొంది. నీటి మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు బ్యాక్వాటర్లో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి సీఐ రవీందర్, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భిక్కనూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్కు చెందిన మౌనిక(26) ముగ్గురు పిల్లలు మైతిలి(10), అక్షర(9), వినయ్(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా.. పిల్లలు స్నానం చేసేందుకు చెరువులో దిగారు.

కాగా.. చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు. వారిని గమనించిన పినతల్లి మౌనిక కాపాండేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించినా ఎవరి ఆచూకీ కనిపించలేదు.

 Also Read: CBI Case on IT officers: ఆదాయపన్ను శాఖలో అవినీతి తిమింగలాలు.. పట్టేసిన సీబీఐ.. కేసులు నమోదు

దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తర్వాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది. దీంతో మిగతా వారికోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలను పోస్టుమార్టం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?