Adinarayana Reddy(imge credit:X)
ఆంధ్రప్రదేశ్

Adinarayana Reddy: సినిమా చూపిస్తాం.. అతి త్వరలో.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

వైఎస్సార్ కడప, స్వేచ్ఛ:Adinarayana Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని తెలిపారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ మేరకు వివేకా హత్యలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి పాత్రే ఎక్కువగా ఉందని పేర్కొన్నట్టు వివరించారు. వివేకా హత్యకు సూత్రధారులు వైఎస్ జగన్, అవినాష్ రెడ్డిలేనని ఆరోపించారు. ‘ నాడు వారే హత్య చేయించి మాపై నిందలు మోపారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతారని మాకేమైనా ముందే తెలుసా? వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే చాలా పెద్దది. జగన్‌ను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వాళ్ళు దిట్ట. సీబీఐ విచారణ జరిగింది. జగన్, అవినాష్‌లకు అంతా తెలుసు.

Also read: Crime : మెహందీ ఆర్టిస్ట్ ఆత్మహత్య

అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా? అని సూటిగా అడుగుతున్నా. వై నాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయాడు. మళ్ళీ పోటీ చేస్తాం అంటున్నారు. ఆ ఉన్న 11సీట్లు కూడా రావు. మీలా డూప్ మాటలు మాట్లాడం. అవినాష్‌ను ఎంపీగా, జగన్‌ను ఎమ్మెల్యేగా ఓడిస్తాం. విద్యలో, గనుల్లో కూడా స్కామ్‌లు జరిగాయి. జగన్‌కు స్కీంలు తెలియవు, స్కాంలు మాత్రమే తెలుసు. జగన్, అవినాష్‌లు లోపలికి పోయే సీజన్ వచ్చింది. అన్నదమ్ములు ఇద్దరూ తోడు దొంగలు. సూపర్ సిక్స్ తప్పకుండా అమలు చేస్తాం. జగన్ అప్పుల దరిద్రమే అమలుకు ఆలస్యం’ అని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!