Crime :హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలేం ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Ugadi 2025: ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్.. వీరికి గుడ్ టైమ్.. మీ రాశి ఎందులో ఉంది?
అత్తాపూర్ నివాసి పింకీ నగరంలో టాప్ మోస్ట్ మెహందీ ఆర్టిస్ట్. సెలబ్రిటీలు సైతం ఆమెను పిలిపించుకొని చేతులకు గోరింటాకు పెట్టించుకునేవారు. వీరిలో టాలీవుడ్ తారలు కూడా ఉండటం గమనార్హం. గత సంవత్సరం పింకీ అమిష్ లోయా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా, శుక్రవారం రాత్రి పింకీ ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కుటుంబ సమస్యలా?.. లేక భర్త వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణాల్లో విచారిస్తున్నారు.