CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలు.. తెలంగాణను పాలించే శక్తి తనకు ఇచ్చారని రేవంత్ అన్నారు. తానేం చేస్తానో… ఏం చేయనో మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని రేవంత్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా లేవనెత్తింది తానేనని సీఎం గుర్తుచేశారు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించి కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ అన్నారు.
ఒక్క సంతకం చాలు..
కొండగల్ నియోజకవర్గ ప్రజల గురించి మరోమారు ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఎవరినో అడగాల్సిన పని లేదన్న సీఎం.. ఒక్క సంతకతంతో అన్నీ కొడంగల్ కు వస్తాయని వ్యాఖ్యానించారు. చిట్టి రాసిస్తే చాలని.. తాను కొడంగల్ కు వచ్చి అన్నీ పూర్తి చేయిస్తానని స్పష్టం చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై కొడంగల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి సీఎం అయినా నియోజక వర్గ బాధ్యతలను ఆయన మర్చిపోలేదని ప్రశంసిస్తున్నారు.
Also Read: Alexandra Hildebrandt: ఈ బామ్మతో అంత ఈజీ కాదు.. తొలి బిడ్డకు 46 ఏళ్లు.. ప్రస్తుతం పదో బిడ్డకు జన్మ
వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం
అంతకుముందు కొడంగల్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాడు. గుడిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అధికారులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో గుడిలోకి ఆహ్వానించారు. స్వామివారి దర్శనం అనంతరం వేదాశీర్వచనాలు అందజేశారు.