MP Chamala Kiran Kumar
తెలంగాణ

MP Chamala Kiran Kumar: పార్లమెంటులో గొంతు నొక్కేస్తున్నారు’.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : MP Chamala Kiran Kumar: పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశాలే దొరకడంలేదని, స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నా స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని, ప్రతిపక్షాలపై ఉద్దేశపూర్వకంగానే వివక్ష కొనసాగుతున్నదని ఆరోపించారు.

గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూల్-193 ప్రకారం ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టినా ఫలితం లేకుండా పోతున్నదన్నారు. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు, ప్రస్తావించే టాపిక్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ జోక్యం చేసుకుని ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం ప్రశ్నించే అధికారమున్నదని, అయినా ఆ నియమాలను స్పీకర్ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు.

 Also Read : BRS MLAs In TG Assembly: అసెంబ్లీలో ఇంత జరిగిందా? వీడియోలు వైరల్.. బీఆర్ఎస్ కు చురకలు?

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు 11 సంవత్సరాలుగా లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ నియామకమే లేదని, రాజ్యాంగం కల్పించిన అధికారంతో ఆర్టికల్ 93 ప్రకారం నియమించాల్సి ఉన్నదని, అయినా స్పీకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అన్ని నిర్ణయాలనూ స్పీకరే ఏకపక్షంగా తీసుకుంటున్నారని అన్నారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన అనుసరించడంలేదని, స్పీకర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అనే ధోరణి నెలకొన్నదన్నారు. చివరకు వివిధ విభాగాలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసే సిఫారసులను సైతం ఆయన పట్టించుకోవడంలేదన్నారు.

 Also Read: TG Govt on Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త కొలువులకు వేళాయేరా?

లోక్‌సభలో సభ్యులు ఇచ్చే వాయిదా తీర్మానాల నిబంధన పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేయడం మంచి సంప్రదాయం కాదని, ఇదే విషయాన్ని తామంతా స్వయంగా స్పీకర్ ఛాంబర్‌కు వెళ్ళి మొరపెట్టుకున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులకు మాట్లాడే అధికారమున్నదని, అయినా దీన్ని స్పీకర్ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు.

 Also Read: Karate Championship 2025: స్పీకర్ తో మంత్రి పొన్నం కుస్తీ.. ఆగని పొన్నం.. ఆ తర్వాత?

లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు ఉంటాయని, కానీ అవి ఆచరణలో అమలుకావడంలేదన్నారు. చివరకు పార్లమెంటు స్వయంగా నిర్వహిస్తున్న ‘సన్సద్ టీవీ’లోనూ ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్న దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో చూపడంలేదని పేర్కొన్నారు. కేవలం అధికార పక్షానికి చెందినవారు మాట్లాడిందే టెలీకాస్ట్ అవుతున్నదన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..