Nara Lokesh (image credit:Twitter)
Politics

Nara Lokesh: కామెడీ పీస్ అంటూ లోకేష్ ఫైర్.. వైసీపీ రియాక్షన్ ఏమిటో?

Nara Lokesh: కామెడీ పీస్ లు ఎక్కువయ్యారు. వారనుకుంటున్నారు.. మనం భయపడతామని.. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. మన పవర్ వారికి తెలుసు. మనమేంటో తెలుసు.. అంటూ మంత్రి నారా లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 43 వ టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న లోకేష్, ఓ రకంగా వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ ఏమన్నారంటే.. వచ్చే 10 రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అలాగే మే నెలకు తల్లికి వందనం ఇస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు.

ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుందని, కొంతమంది బాత్ రూం లో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారన్నారు. అర్దం అయ్యిందా రాజా.. అధికారంలో ఉన్నాం అని గర్వం వద్దు, ఇగో వద్దు. అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దామని తెలిపారు.

ప్రజల ఆశీస్సులు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల మనసు గెలిచేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు నిరంతరం శ్రమించాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు – ఢిల్లీ పాలిటిక్స్ తెలుసని, జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్దానికి వాడుకోలేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టిడిపి అని, అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడం లో టిడిపి కృషి ఉందన్నారు. జిఎంసి బాలయోగిని పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్ చేసింది మనమేనన్న లోకేష్, అంబేద్కర్‌ కు భారతరత్న రావడంలోనూ కీలకపాత్ర పోషించామని తెలిపారు. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడం లో కీలక పాత్ర పోషించామని లోకేష్ తెలిపారు. తెలుగు దేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారని, అలాంటి వారు అడ్రెస్స్ లేకుండా పోయారని తెలిపారు.

2019 వరకూ చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకూ చూసిన రాజకీయం వేరని, అయిదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను ప్రజలు ఎదుర్కొన్నారన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డామని, అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామన్నారు.

Also Read: Bank Holidays April 2025: అలర్ట్.. అలర్ట్.. ఏప్రిల్ లో సగం రోజులు.. బ్యాంక్ సెలవులే..

క్లైమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామన్నారు. అలా అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపామని లోకేష్ తెలిపారు. 2024 ఎన్నికల్లో స్ట్రయిక్ రేట్ 94 శాతం. 58 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశామని, మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 65 శాతం ఓట్ షేర్ సాధించామన్నారు. అయితే కామెడీ పీస్ అంటూ వైసీపీని ఉద్దేశించి లోకేష్ కామెంట్స్ చేశారని వైసీపీ భగ్గుమంటోంది.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..