EC issues notice to cm jagan సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
CM Jagan
Political News

EC: సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం ఈసీ నోటీసులు పంపింది. జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోసగాడు అంటూ, ఎన్నికల సంఘం వర్ల రామయ్య ఫిర్యాదు పరిశీలించి యాక్షన్ తీసుకుంది. సీఎం జగన్‌కు నోటీసులు పంపింది.

జగన్ తన బస్సు యాత్రలో మాట్లాడుతూ చంద్రబాబుపై, ఆయన గత పాలనపై, టీడీపీ మ్యానిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆరు అంశాలను తరుచూ పేర్కొంటూ చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రసంగాలకు సంబంధించిన వీడియోను కూడా సమర్పించారు.

Also Read: ‘ఓటు ఎవరికైనా వేయండి.. కానీ వేయండి’

ఈ ఎన్నికలు జగన్‌కు చంద్రబాబుకు కాదని, ప్రజలకు – పెత్తందారులకు అని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. టీడీపీ చేసిన ఫిర్యాదు వల్లే పింఛన్ ఆగిపోయందని, తద్వార 31 మంది పింఛన్ లబ్దిదారులు మరణించారని, ఈ మరణాలకు చంద్రబాబు నాయుడే బాధ్యుడని జగన్ ఆరోపించారు. అలాగే.. టీడీపీ మ్యానిఫెస్టోను చూపిస్తూ ఆ హామీలను విమర్శించారు. గతంలో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు.

సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. ఈ వ్యాఖ్యలను సీఎం జగన్‌కు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలని నోటీసులు పంపింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. న్యాయనిపుణులను సంప్రదించి వివరణ ఇస్తామని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..