Karate Championship 2025: హైదరాబాద్ గచ్చిబౌలిలో నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పౌటీలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం పోటీల నిర్వహకులు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నంను బ్లాక్ బెల్ట్ ప్రధానం చేసి గౌరవించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కరాటే దుస్తుల్లో బ్లాక్ బెల్ట్ అందుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆ తర్వాత ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చారు. డిష్యూం.. డిష్యూం అన్న రేంజ్ లో వారిద్దరు స్టిల్స్ ఇవ్వడంతో క్రీడా ప్రాంగణమంతా ఒక్కసారిగా హర్షధ్వానాలతో మార్మోగింది. అందరి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడు ప్రజాసంక్షేమం కోసం తలమునకలై ఉండే ఇద్దరు నేతలు ఇలా సరదాగా ఉండటం చూసి పార్టీ శ్రేణులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కరాటే పోటీల ప్రారంభోత్సవానికి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) కూడా హాజరైంది.
అనంతరం నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 గురించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపే క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. క్రీడలు ఆడుతూ యువత శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా మారాలని టీపీసీసీ చీఫ్ అన్నారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ముందంజలో ఉండాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలను మరింత అభిృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
Also Read: Man Marries 2 Women: ‘నువ్వు పెట్టి పుట్టావ్ బ్రో’.. ఇద్దరు యువతుల్ని పెళ్లాడిన యువకుడు
కాగా ఈ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలు.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. దేశం నలుమూల నుంచి ప్రముఖ కరాటే క్రీడకారులు ఇందులో పాల్గొని తమ సత్తా ఏంటో చాటనున్నారు. ఛాంపియన్ షిప్ లో సత్తాచాటిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది.