Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: లోకేష్ కు ఒక్క మెసేజ్.. అందరూ అలర్ట్.. అంతా 15 నిమిషాల్లోనే..

Nara Lokesh: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు. ఎప్పూడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లోకేష్ ఎవరికి ఏ ఆపద వచ్చిన ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లోనే స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా సకాలంలో స్పందించడంతో ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరగనుంది. తన సొంత ఖర్చులతో గుండె తరలింపునకు లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్‌కు మార్గంను కూడా సుగమం చేశారు. ‘ ఒక్క చిన్న మెసేజ్ చేస్తే కేవలం 15నిమిషాల్లో స్పందించే మంత్రిని మేం ఇప్పటి వరకు చూడలేదు. లోకేష్ మేం మెసేజ్ చేసిన వెంటనే స్పందించి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు తరలించడానికి సొంత ఖర్చులతో విమానం పంపించడం మానవత్వానికి కొలమానం. 47ఏళ్ల వయస్సు గల పేషెంట్ బ్రెయిన్ డెడ్ కండిషన్ లో ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంలో లోకేష్ స్పందించిన తీరు అభినందనీయం’ అని జనాలు చెప్పారు.

Also Read: Telangana Govt: 31 తర్వాత కుదరదు.. వెళ్లండి.. కార్యదర్శి ఉత్తర్వులు

అసలేం జరిగింది?

గుంటూరు రమేష్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవదానానికి అంగీకరించారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని లోకేష్‌కు ఒక్క మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు, తిరుపతి ఆస్పత్రికి గుండె చేరేవరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో లోకేష్ ఏర్పాటు చేయడంతో సుసాధ్యం అయింది. దీంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!