10 Class Student (imagecredit:twitter)
తెలంగాణ

10 Class Student: హైకోర్టును ఆశ్రయించిన టెన్త్ విద్యార్థిని.. అసలేం జరిగిందంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: 10 Class Student: టెన్త్ పేపర్ లీక్​ కేసులో డీబార్ ​అయిన 1‌‌0వ తరగతి విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది. తనను పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్​ దాఖలు చేసింది. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్​ కేసులో నకిరేకల్​ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీని బాధ్యురాలిగా పేర్కొంటూ విద్యా శాఖ అధికారులు ఆమెను డిబార్​ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఇందులో తన తప్పేమి లేదంటూ ఝాన్సీ లక్ష్మి గురువారం హైకోర్టులో లంచ్​మోషన్​ పిటిషన్ దాఖలు చేసింది. ఆకతాయి బండరాయితో కొడతానని బెదిరిస్తే ప్రశ్నాపత్రాన్ని చూపించినట్టుగా పేర్కొంది. పూర్తిగా విచారణ జరపకుండానే అధికారులు తనను డిబార్​ చేశారని తెలిపింది. తనను పరీక్షలకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.

తన పిటిషన్​లో విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్​ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​సెక్రటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్​పరీక్షా కేంద్రం సూపరిండింటెంట్ లను ప్రతివాదులుగా పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏప్రిల్ 7న కౌంటర్​ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కేసును వాయిదా వేసింది.

Also Read: Bank of baroda Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతం!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!