CM Revanth on KCR
తెలంగాణ

CM Revanth on KCR: రాజకీయ కక్ష సాధింపు మీదా? మాదా?.. సీఎం రేవంత్ ఫైర్

CM Revanth on KCR అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్ష బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు అసెంబ్లీ సాక్షిగా తిప్పికొట్టారు. తాము నిజంగా కక్ష్య పూరితంగా వ్యవహిరిస్తే వారు ఇక్కడ (అసెంబ్లీలో) కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడేవారా? అంటూ ప్రశ్నించారు. గతంలో తనను పెట్టిన చంచల్ గూడా జైల్లోనే, చర్లపల్లి జైల్లోనే ఉండేవారని సెటైర్లు వేశారు.

నిద్రకూడా పోనివ్వలేదు
సాధారణంగా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్ వేస్తారని సీఎం రేవంత్ అన్నారు. కానీ అధికారం అడ్డుపెట్టుకొని ఎంపీగా ఉన్న తనను చర్లపల్లి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. 16 రోజులు తనను జైల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా సెల్ లో నిర్భందించారని రేవంత్ తెలిపారు. లైట్లు ఆన్ లోనే పెట్టి రాత్రి కూడా పడుకోనివ్వకుండా చేశారని మండిపడ్డారు. కోపాన్ని బిగపట్టారనే తప్ప కక్ష్య సాధింపులకు దిగలేదని రేవంత్ స్పష్టం చేశారు.

Also Read: Bhatti Vikramarka: తెలంగాణ అప్పులపై కాగ్ సంచలన రిపోర్ట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

కేసీఆర్ పై సెటైర్లు
తన మీద కక్ష్య చూపిన వారిని దేవుడే ఆస్పత్రి పాలు చేశారని పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం జరిగిన రోజే అది జరిగిందని గుర్తుచేశారు. తన బిడ్డ లఘ్నపత్రిక రాసుకోవడానికి సైతం చర్లపల్లి జైలు నుంచి వెళ్లేందుకు అనుమతించలేదని గుర్తు చేశారు. రాజకీయ కక్ష్య సాధింపు మీదా? మాదా? అంటూ కేసీఆర్ కుటుంబాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. తాను నిజంగా కక్ష్య సాధించాలని చూస్తే మీ కుటుంబంలో ఏ ఒక్కరు బయట మిగలరని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అధికారాని సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగించాలని తాను నిర్ణయించుకున్నట్లు రేవంత్ అన్నారు. అందుకే విచక్షణతో వారిపై (కేసీఆర్ ఫ్యామిలీ) కేసులు పెట్టలేదని పేర్కొన్నారు.

Also Read This: Free IPL Passes: గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా ఐపీఎల్ టికెట్లు.. ఎలా పొందాలంటే?

‘కేసీఆర్.. రుణమాఫీ మాట ఏమైంది’
రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ ఆధికారం చేపట్టిన తొలి నాలుగేళ్లలో రుణమాఫీకి రూ.16,143 కోట్లు ఖర్చు చేశారని రేవంత్ తెలిపారు. రెండో దఫా అధికారం లోకి వచ్చాక తొలి నాలుగేళ్లు ఒక్క రూపాయి కూడా రుణమాఫీకి కేటాయించలేదని చెప్పారు.మెుత్తంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.16,908 కోట్లు మాత్రమే రుణమాఫీకి ఖర్చు చేశారన్న రేవంత్.. తాము అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల్లోనే రూ.20,616.89 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?