Uttam Kumar Reddy (imagecredit:AI)
తెలంగాణ

Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ విషయం మీకు తెలుసా!

తెలంగాణ బ్యూరోస్వేచ్ఛ: Uttam Kumar Reddy: ఉగాది పండుగ నుంచి అన్ని రేషన్ షాపుల్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన సివిల్ సప్లై, ఇరిగేషన్ పద్దులతో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఏ సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పంపిణీలో సభ్యులు పాల్వాయి హరీశ్ బాబు చెప్పిన విధంగా కొన్ని లోపాలున్నాయని మంత్రి అంగీకరించారు. ఈ బియ్యం సుమారు 70 నుంచి 80 శాతం నిజమైన లబ్దిదారులకు అందటం లేదని, బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయని వెల్లడించారు.

ఈ పరిణామాన్ని కట్టడి చేసేందుకు రేషన్ షాపుల్లో ఇదివరకు పరిమిత సంఖ్యలోనే అందిస్తున్న నిత్యావసర వస్తులకు తోడు ఇతర అన్ని రకాల నిత్యావసర వస్తులను విక్రయించుకునే వెసులుబాటు డీలర్లకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బియ్యాన్ని అక్రమార్గంలో తరలించి సంపాదనకు పాల్పడకుండా ఉండేందుకు డీలర్లకు ఈ వెసులుబాటు కల్పించటంతో పాటు ఇటీవలే డీలర్ల కమీషన్ ను పెంచినట్లు వివరించారు. ఇప్పటికే రేషన్ కార్డులున్న వారికి, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని రేషన్ కార్డులు అందని వారి పేరు జాబితాలో ఉన్న వారికి సైతం ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా క్వాలిటీ ఫైన్ రైస్ ను అందించేందుకు క్యాబినెట్ మీటింగ్ లో తీర్మానం చేశామని,

Also Read: Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!

ఈ నెల 30వ తేదీన ఈ పీడీఎస్ ఫైన్ రైస్ బియ్యం పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా ఈ విప్లవాత్మకమైన ఓ మంచి నిర్ణయాన్ని మన రాష్ట్రంలోనే మొదటి సారిగా తీసుకున్నట్లు మంత్రి సభా ముఖంగా వెల్లడించారు. కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఈ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర జనాభాలో సుమారు 84 శాతం జనాభాకు క్వాలిటీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు,ఎక్కడా లేని విదంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందిస్తామని వివరించారు.

కేటాయింపుల్లో ఎక్కువ అప్పులకే

రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26) కు సంబంధించి సర్కారు రూపొందించిన వార్షిక బడ్జెట్ లో ఇరిగేషన్ శాఖకు రూ.23 వేల 330 కోట్లు కేటాయించినా, ఇందులో దాదాపు రూ. 15 వేల కోట్లు గత సర్కారు చేసిన అప్పులకు మిత్తీలు చెల్లించేందుకే సరిపోతుందని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాధారణంగా రుణాలు అనేవి నో ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్ ప్రాతిపదికన ప్రభుత్వాలు తీసుకుంటాయని,

గత సర్కారు మాత్రం షార్ట్ టర్మ్ హై ఇంట్రెస్ట్ ప్రాతిపదికన రుణాలు తీసుకుందని అందుకే మిత్తీలకు రూ. 15 వేల కోట్లను చెల్లించాల్సి వస్తుందని వివరించారు. నీటి పారుల ప్రాజెక్టుల మంజూరీలో ఎలాంటి వివక్ష ఉండదని సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఉత్తమ్ వివరించారు. తక్కువ ఖర్చు ఎక్కువ ఆయుకట్టు ఉండేలా ప్రాజెక్టులను చేపడుతామని,త్వరలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు , ఇది తమ మేనిఫెస్టలో కూడా ఉందని మంత్రి గుర్తు చేశారు.

ఎస్ఎల్ బీసీ ఘటన బాధాకరం 

శ్రీశైలం ఎస్ఎల్ బీసీ ఘటన చాలా బాధాకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో సభాముఖంగా విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగి నెల రోజులుగడుస్తున్నా, కేవలం ఇద్దరి మృతదేహాలను గుర్తించగలిగామని వివరించారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లోనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించినట్లు ఆయన వివరించారు.టన్నల్ ఆపరేషన్లలో అనుభవం కల్గిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులను రప్పించామని వివరించారు. ఈ విషయానికి సంబంధించిన సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రివ్యూ కూడా జరిగిందని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాను చెల్లిస్తున్నట్లు వివరించారు.

Also Read: Bhatti Vikaramarka: భలే ఛాన్స్ పట్టేసిన భట్టి.. ఏకంగా ఆ కమిటీలోనే స్థానం..

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ