Degree Jobs image Source (AI)
జాబ్స్

Degree Jobs: డిగ్రీ పాసయ్యారా.. బ్యాంక్ జాబ్ మీ కోసమే ..!

ప్రస్తుతం, బ్యాంక్‌ ఉద్యోగాలకు డిమాండ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. డిగ్రీ పాస్ అయిన వారికి  బ్యాంక్‌ ఉద్యోగాలు రావడమంటే చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అయితే.. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు సువర్ణావకాశమనే చెప్పొచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) రిక్రూట్‌మెంట్ 2025లో భాగంగా మొత్తం 400 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 01-03-2025న ప్రారంభమై 28-03-2025న ముగుస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు BOI వెబ్‌సైట్ bankofindia.co.in లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF ను మార్చి 20, 2025న bankofindia.co.inలో విడుదల చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) అప్రెంటిస్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ వివరాలు, ఖాళీ పోస్టులు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ ఇలా దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ్యమైన సమాచారం:

దరఖాస్తు రుసుము:

PwBD అభ్యర్థులకు: రూ.400/- + GST

షెడ్యూల్ కులం / షెడ్యూల్ తెగ / అన్ని మహిళా అభ్యర్థులకు: రూ.600/- + GST

మిగతా అభ్యర్థులందరికి: రూ. 800/- + GST

బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025 వయోపరిమితి:

కనీస వయోపరిమితి: 20 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు

అభ్యర్థి 02.01.1997 కంటే ముందు 01.01.2005 కంటే తర్వాత జన్మించి ఉండాలి

నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత:

అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థి 01.04.2021 నుంచి 01.01.2025 మధ్య తన గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌లకు ప్రతి నెల రూ.12000/- ( పన్నెండు వేల రూపాయలు మాత్రమే) స్టైఫండ్‌ను అందజేస్తారు. ఇతర అలవెన్సులు/ప్రయోజనాలకు అప్రెంటిస్‌ల అర్హులు కారు.

ముఖ్యమైన తేదీలు:

బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 01-03-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15-03-2025

పొడిగించిన చివరి తేదీ: 28-03-2025

Note : ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?