Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్..
Case on Bandi Sanjay
Telangana News

Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!

కరీంనగర్‌, స్వేచ్ఛ: Case on Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్‌పై బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై నిరాధారమైన, వ్యక్తిగత ప్రతిష్టను, కుటుంబ విలువను దిగజార్చే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడం జరిగింది.

Also Read: Hyderabad MMTs Incident: నాతో తప్పుగా ప్రవర్తించింది వాడే.. ఎంఎంటీఎస్ ఘటనలో కీలక మలుపు

కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ పై బీదర్ లో దొంగనోట్ల ముద్రణ ప్రింటింగ్ చేసినట్టు, ఆ నోట్లను ఎన్నికల్లో పంపిణీ చేశారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన నిరాధారమైన ఆరోపణలు కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగమని, ఈ మాటల వల్ల యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మనస్థాపానికి గురైనారని అన్నారు. ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం చూస్తే బండి సంజయ్ గల్లీలో మాట్లాడే సిల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని, ఈ అర్థం పర్థం లేని వికృతమైన మాటలు సరికాదని  తను కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన మాట విధానంలో మార్పు రాలేదని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి సరైన బుద్ధి చెప్తారని అన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..