Kannappa: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఏప్రిల్ 25న థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. మోహన్ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. సినిమా విడుదల లోపు పాత్రలన్నింటినీ పరిచయం చేయాలని మేకర్స్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్లు, పాటలు అన్నీ కూడా సినిమాపై క్రేజ్‌ని పెంచేయగా.. విడుదలకు దగ్గరయ్యే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్‌లో దూకుడు పెంచుతున్నారు.
Also Read- Mazaka OTT: ‘మజాకా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఈ ఉగాదికి నవ్వులే నవ్వుల్!
ఇప్పటికే మంచు విష్ణు పలు రాష్ట్రాలలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు. మరోవైపు చిత్రంలోని పోస్టర్స్‌ని విడుదల చేస్తూనే ఉన్నారు. అలాగే, ప్రతి సోమవారం ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. అదేంటంటే.. ఈ సినిమాలో రఘుబాబు పాత్రని మేకర్స్ రివీల్ చేశారు. ‘కన్నప్ప’లో రఘుబాబు (Raghubabu) ‘మల్లు’ (Mallu) అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర తాలుకూ ఫస్ట్ లుక్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ ఫస్ట్ లుక్‌లో మల్లుగా రఘుబాబు భయంకరంగా కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ చూస్తుంటే ఎవరివైపో ఆగ్రహంగా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్‌లో రౌద్రంగా రఘుబాబు కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇందులో అతని పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందనేది అర్థమవుతోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌లో స్టార్ క్యాస్ట్ సంగతి పక్కన పెడితే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో రఘుబాబు పాత్ర మాత్రం ఆకర్షణీయంగా ఉంది. అలాగే పేరుకు తగ్గ నటుడిని సెలక్ట్ చేశారనే ఫీల్‌ని ఇస్తుంది. అలాగే ఇలాంటి పాత్ర రఘుబాబుకి కూడా ఫస్ట్ టైమ్ కావడంతో.. కచ్చితంగా అతను కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఉంటాడని భావించవచ్చు.
Also Read- Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?
మహామహులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో శివయ్యగా అక్షయ్ కుమార్ (Akshay Kumar), పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రుద్రుడిగా ప్రభాస్ (Prabhas), మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలు ఇప్పటికే ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేశాయి. మంచు ఫ్యామిలీకి చెందిన కొత్త తరం కూడా ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎలా చూసినా, ఈ సినిమా మంచు ఫ్యామిలీకి చాలా చాలా ప్రాముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు కన్నప్ప టీమ్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న (Kannappa Release Date) రిలీజ్ చేయనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు