betting apps promotion case (image credit:Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?

Betting Apps Promotion Case: ఆన్​ లైన్​ బెట్టింగ్​ యాప్​ ల ప్రమోషన్ల కేసులో నిందితులుగా ఉన్న బుల్లితెర నటులు విష్ణుప్రియ, రీతూ చౌదరిలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. కాగా, తనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ లను క్వాష్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విష్ణుప్రియ హైకోర్టులో పిటీషన్​ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించిన తరువాత ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాలని ఆమె భావిస్తున్నట్టు సమాచారం.

వినయ్​ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియ, రీతూ చౌదరి, యాంకర్​ శ్యామల, టేస్టీ తేజ, కానిస్టేబుల్​ కిరణ్​ గౌడ్​ తోపాటు మొత్తం 11మంది సెలబ్రెటీలు, ఇన్​ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న నిందితులు అందరికీ నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణ వారిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్​ కిరణ్​ గౌడ్​, విష్ణుప్రియ, రీతూ చౌదరిలు ఓసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే. తనకు గడువు కావాలని పోలీసులను కోరిన యాంకర్, వైఎస్సార్​ సీపీ అధికార ప్రతినిధి శ్యామల తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసులను కొట్టివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. అయితే, శ్యామలను అరెస్ట్​ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. ఈ క్రమంలో శ్యామల సోమవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాగా, మంగళవారం విష్ణుప్రియ, రీతూ చౌదరిలు విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంది.

Also Read: Saweety Boora: పోలీసు స్టేషన్ లో వాగ్వాదం.. భర్తపై దాడి చేసిన ప్రముఖ మహిళా బాక్సర్

అయితే, ఇద్దరూ రాలేదు. దీనికి సంబంధించి పోలీసులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. కాగా, తనపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్​ స్టేషన్లలో నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఒకే నేరంపై రెండు చోట్ల కేసులు నమోదు చేశారంటూ తన పిటిషన్​ లో పేర్కొన్నారు. హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ దాఖలు చేసిన నేపథ్యంలోనే విష్ణుప్రియ మంగళవారం పోలీసుల విచారణకు రాలేదని సమాచారం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు