Glycel BT-3 seeds (imagecredit:twitter)
తెలంగాణ

Glycel BT-3 seeds: రైతన్నా.. పారా హుషార్.. ఆదమరిచావో ఇక అంతే!

కరీంనగర్​స్వేచ్చ: Glycel BT-3 seeds: ప్రభుత్వ నిషేదిత జాబితాలో ఉన్న గ్లైసెల్​ బీటీ–3 విత్తనాలను రైతులకు అట్టగట్టి సోమ్ము చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇతర రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు దిగుమతి అవుతున్నాయి. తెలంగాణ పెద్ద ఎత్తున పత్తి సాగు చేస్తున్న నేపథ్యంలో పత్తి విత్తనాలకు వాన కాలం సీజన్​కు ముందే పెద్ద ఎత్తున గ్లైసెల్​ బీటీ విత్తనాలను మంచి డిమాండ్​ఉంటుందని భావించిన పలువురు ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల నుంచి నిషేదిత గ్లైసెల్​ బీటీ–3 విత్తనాలు తీసుకువచ్చి రైతులకు విక్రయిస్తున్నాట్లు సమాచారం.

అనుమతి లేని పత్తి విత్తనాల విక్రయాలపై పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతుండగా పోలీసులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏలాంటి అనుమతి లేని పత్తి విత్తనాలను రైతులకు కొందరు దళారులు అంటగడుతున్నారు. ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున నిషేదిత గ్లైసెల్​ బీటీ–3 విత్తనాలు తీసుకువస్తున్న పలువురు రైతులకు విక్రయిస్తు సోమ్ము చేసుకుంటున్నారు. దళారుల మాటలు నమ్ముతున్న రైతులు ఏలాంటి అనుమతి లేని బీటీ–3 విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు రైతులు.

Also Read: Hyderabad Crime: న్యాయవాది దారుణ హత్య.. రెక్కి చేసి మరీ..

ఈఅక్రమ దందా కుర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి, కరీంనగర్​, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు కేంద్రాలుగా మారాయి. మంచిర్యాల జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున బీటీ–3 విత్తనాలను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఈదందా గత కొంత కాలంగా మూడు పూవ్వులు ఆరు కాయలుగా వర్ధింతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గ్లైసెల్​ బీటీ విత్తనాలు సాగు చేయడం ద్వార దిగుబడి ఎక్కువ వస్తుందని రైతులకు ఆశలు చూపిస్తున్నారు. నకిలీ విత్తనాలు ఈవిత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు రాక నష్టపోయిన రైతులు ఉన్నారు.

గ్లైసెల్​ బీటీ–3 విత్తనమంటే..?

బీటీ–2 పత్తి విత్తనాలతో రైతులకు చీడపీడల నుంచి విముక్తి కల్పించినప్పటికీ పత్తి పంటలో కలుపు కష్టాలు మాత్రం తప్పడం లేదు. కలుపు నివారణ కోసం రైతులు పత్తి విత్తనాలు నాటిన 24గంటల లోపు కలుపు నివారణ మందులు పిచ్చికారి చేస్తున్నారు. విత్తనాలు మొలకెత్తిన తరువాత కలుపు నివారణ మందులు వాడటంతో పత్తి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. గ్లైసెల్​ బీటీ విత్తనాలు వాడటం వలన కలుపు నివారణ మందులు పిచ్చికారి చేసిన పత్తి మొక్కలు చనిపోవు. కలుపు నివారణ కోసం రైతులకు పంట పెట్టుబడిలో కలువు తీస్తే ఖర్చు తగ్గుతుంది అన్నమాట.

బీటీ–1, బీటీ–2 అనుమతి..

ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పత్తి పంట రాష్ర్టంలో పెద్ద ఎత్తున రైతులు పండిస్తున్నారు. బీటీ1, బీటీ–2 విత్తనాలు రాక ముందు పత్తి పంటకు లద్దె పురుగు, ఆకుపచ్చ పురుగులు పంటను ఆశించి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కల్గించేవి. పత్తి పంటలో లద్దె పురుగు, ఆకుపచ్చ పురుగుల నివారణ కోసం శాస్ర్తవేత్తలు అనేక సంవత్సరాలు కష్టపడి బీటీ1. బీటీ–2 విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

బీటీ–2 విత్తనాలు సాగు చేయడం వలన 100రోజుల వరకు పత్తిపై ఆకుపచ్చ పురుగులతో పాటు లద్దె పురుగులు ఆశించవు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి బీటీ1, బీటీ–2 విత్తనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. బీటీ–2 విత్తనాలు 48రోజుల్లో పూతకు వస్తుంది అంటే దాదాపు 100రోజుల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే రాష్ర్టంలోని రైతులు బీటీ–2 విత్తనాలపై సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

సర్కార్​ నుంచి అనుమతి లేదు

గ్లైసెల్​ బీటీ ‌–3 విత్తనాలు విక్రయించడానికి ప్రభుత్వం నుంచి ఏలాంటి అనుమతి లేదు. ఎందుకంటే కలుపు నివారణ కోసం గ్లైఫోసెట్ (నిషేధిత గడ్డి మందు) ఉపయోగించాలి. గ్లైఫోసెట్​ మందు పంటపై పిచ్చికారి చేస్తే సమయంలో గాలిలో కలిసి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని గ్లైఫోసెట్​ గడ్డి మందు విక్రయాలను ప్రభుత్వం నిషేదించింది. ఈగడ్డి మందు వాడటం వలన భూమికి అపార నష్టం కలుగుతుందని శాస్ర్తవేత్తలు అంటున్నారు. భూమి తన సారం పూర్తిగా కోల్పోయి విషతుల్యంగా మారుతుందని రెండవ పంట నుండి దిగుబడి క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టి భూమి ఏలాంటి పంటలు వేయకుండ పనికి రాకుండ పోయే ప్రమాదం ఉండటంతో గ్లైసెల్​ బీటీ–3 విత్తనాలతో పాటు గ్లైఫోసెట్​ గడ్డి మందు విక్రయాలపై ప్రభుత్వం నిషేదం విధించింది.

 సీజన్​కు ముందే..

ప్రతి సంవత్సరం వర్షాలను బట్టి రైతులు జూన్​, జూలై నెలలో పత్తి విత్తనాలు నాటుతారు, రైతులు సాధారణం మే, జూన్​ మాసంలో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తారు. సీజన్​ సమయంలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు దాడులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యం నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్న వ్యాపారులు సీజన్​కు ముందే బీటీ–3 విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని తమ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. రైతుల వద్దకు పూర్తి స్థాయిలో చేరకముందే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను విక్రయాలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

Also Read: Attack on Mumbai Actress: అర్ధరాత్రి నటి గదిలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు.. తర్వాత ఏమైందంటే?

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు