నల్లగొండ బ్యూరో, స్వేచ్ఛ: Komatireddy Venkat Reddy: ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంచుతామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు రబీ ధాన్యాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టి తేమను పరీక్షించుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అంతేకాక సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోలులో రైతులు, పీఏసీఎస్, ఐకెపీ కేంద్రాలు ప్రభుత్వానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రబీలో జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, అవసరమైతే ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు.
Also read: Yuva Vikasam Scheme: కార్పొరేషన్స్ మళ్లీ యాక్టివ్.. ఏకంగా రూ. 6 వేల కోట్లు కేటాయింపు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు ఏర్పాటు చేయాలని, తాటి మట్టలతో నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. మిల్లర్లు న్యాయంగా వ్యాపారం చేయాలని, తప్పులు చేయవద్దని, తేమ పేరుతో అనవసరంగా రైతులను ఇబ్బందులు చేయవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యానికి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని, ఉగాది నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, గతంలో ధాన్యం రీసైక్లింగ్ అయ్యే విషయాన్ని గుర్తు చేశారు.
Also read: Local Body MLC Elections: హైదరాబాద్ లో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. ఏప్రిల్ 23న పోలింగ్
ఏఎమ్మార్పీ ఉదయ సముద్రం ద్వారా సాగు నీరు అందించామని, దీనివల్ల ఈ సంవత్సరం లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, ఎల్లారెడ్డిగూడెం వరకు సాగునీరు అందిస్తున్నామని, శ్రీశైలం హైడెల్ ప్రాజెక్టు ద్వారా ఏఎమ్మార్పీ నుండి నీరు తీసుకురానున్నామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల పూర్తి చేయడం ద్వారా మర్రిగూడెం చెరువుకు నీళ్లు ఇస్తామని, కాల్వల ద్వారా నీరు అందించేందుకు భూసేకరణ పూర్తి చేశామని, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా కట్టంగూరు, నార్కెట్ పల్లి, మునుగోడులో రానున్న మూడు, నాలుగు నెలల్లో కాలువలు పూర్తయితే లక్ష ఎకరాలకు నీరు రానుందని తెలిపారు.
Also read: BRS 25th Anniversary: బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్.. ఆ ఇద్దరు నేతల గురించే అంతా చర్చ..
ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరీష్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిసిఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/