తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Meenakshi Natarajan: కాంగ్రెస్ లో ఐక్యతా రాగం విధానాన్ని పాటించాల్సిందేనని ఏఐసీసీ మరోసారి నొక్కిచెప్పింది. జూనియర్ల నుంచి సీనియర్లు వరకు ఈ నిబంధనను ఫాలో అవ్వాలని సూచించింది. వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టి, వచ్చిన పవర్ ను పదేళ్ల పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ తాజాగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ కూడా ఇదే అంశంపై ఇటీవల జూమ్ మీటింగ్ లోనూ ప్రస్తావించారు. చాలా మంది నేతలు వ్యక్తిగత విభేదాలతో పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదంటూ సూచించారు. పార్టీలోని ఇంటర్నల్ చర్చల ద్వారా సమస్యలకు చెక్ పెట్టుకోవాలని కోరారు.
Also read: BRS 25th Anniversary: బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్.. ఆ ఇద్దరు నేతల గురించే అంతా చర్చ..
కొందరు లీడర్లు బహిరంగంగానే విమర్శలు చేయడం వలన సొంత పార్టీపైనే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ పెరుగుతుందని వివరించారు. ఇలాంటివి తాను సహించనని, తగ్గించుకుంటే బెటర్ అంటూ ఆమె చెప్పినట్లు తెలిసింది. ఇటీవల గాంధీభవన్ లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి కూడా విభేదాల అంశంపై మాట్లాడారు.‘చెడును చెవిలో చెప్పాలి. మంచిని మైక్ లో చెప్పాలి’ అని సూచించారు. కంటిన్యూస్ గా పార్టీలో వ్యక్తిగత విమర్శలు తెర మీదకు వస్తుండటంతో ఏఐసీసీ సీరియస్ అయింది. నాయకులంతా ఐక్యంగా హైకమాండ్ చెప్పిన ఆదేశాలను పాటించాలని ఆదేశించింది.
Also read: Illegal Lottery Tickets Sale: సీఎం సొంత జిల్లాల్లో అక్రమ లాటరీ దందా.. కుదేలవుతున్న బాధితులు
ఏడాది లోపేనా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత పవర్ లభించింది. ఇందులో కార్యకర్తల నుంచి లీడర్ల వరకు కృషి ఎంతగానో ఉన్నది. బీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. చాలా మంది సీనియర్ నాయకులు తమదైన శైలిలో గత ప్రభుత్వంపై పోరాడారు. అయితే అధికారం వచ్చిన ఏడాదిలోపే కొందరి నేతల్లో అసంతృప్తి నెలకొన్నది. పదవులు, ప్రయారిటీ ఇవ్వడం లేదనే కారణాలతో నిత్యం పార్టీపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు.
Also read: Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ బయటకు రావడం ఆనందమే.. ఎంపీ చామల
వ్యక్తిగత విభేదాలను పార్టీకి ఆపాదిస్తున్నారు. దీని గ్రౌండ్ లెవల్ లోని క్యాడర్ డైలమాలో పడటంతో పాటు పార్టీ కోసం పనిచేసేందుకు నిరుత్సాహం చెందుతున్నారు. గతంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షికి పలుమార్లు ఇలాంటి కంప్లైంట్స్ వెళ్లాయి. కానీ ఆమె కొంత మంది నేతలకు పెద్దపీట వేస్తూ, క్షేత్రస్థాయి నేతలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేరుగా రాహుల్ గాంధీ కి అతి దగ్గరి వ్యక్తే ఇన్ చార్జీగా రావడంతో పరిస్థితులు మారతాయని కేడర్ భావిస్తుంది. పరిస్థితులను చక్కదిద్దేందుకే ఐక్యతా రాగం ఫాలసీని ఆమె తెర మీదకు తీసుకువచ్చారనే ప్రచారం జరుగుతుంది.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/