Tollywood Gossips (image credit:Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood Gossips: టాలీవుడ్ కు ఎన్ని బాధలు? ఒకటి పోతే మరొకటి..

Tollywood Gossips: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతం కంటే భిన్నంగా టాలీవుడ్ స్థాయి హై రేంజ్ లో ఉంది. ఆ రేంజ్ ఏమో కానీ, వివాదాలు కూడా అదే రేంజ్ లో చుట్టుముట్టుతున్నాయి. ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తుండగా, ఇంతకు టాలీవుడ్ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉందట. కొందరి నిర్వాకంతో నిరంతరం టాలీవుడ్ ఏదొక రూపంలో వార్తల్లో నిలుస్తోంది. ఇంతకు టాలీవుడ్ కు ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

టాలీవుడ్ అంటే అన్ని భాషల చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం. ఎన్నో అద్భుత విజయాలు, సూపర్ డూపర్ హిట్ లు, ఆస్కార్ రేంజ్ తరహా సినిమాలకు నెలవుగా మారింది. టాలీవుడ్ కు ఆస్కార్ అల్లంత దూరమేనన్న వారి విమర్శలకు ఇటీవల త్రిబుల్ ఆర్ మూవీ పెద్ద పాఠమే నేర్పింది. బాలీవుడ్ కు ఉన్న రేంజ్ ను టాలీవుడ్ సినిమాలు ఎప్పుడో దాటిపోయాయి. అందుకే కాబోలు బాలీవుడ్ తారలు.. టాలీవుడ్ దారి పట్టారని చెప్పవచ్చు. ఇంతటి పేరు తెచ్చుకున్న టాలీవుడ్ కు కొన్ని మచ్చలు కూడా ఉన్నాయి. ఎవరి దిష్టి తగిలిందో కానీ ఏదొక వివాదం టాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది.

ఎక్కడైనా డ్రగ్స్ పట్టుబడ్డాయా? అక్కడ టాలీవుడ్ కు చెందిన ఎవరో ఒకరి పేరు తెర మీదికి వస్తోంది. కొద్దిరోజులు మీడియాలో ఇక అదే హాట్ టాపిక్ గా మారడం కామన్. ఇప్పటికే పలువురు సినీ తారలు డ్రగ్స్ వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక నిన్నటి వరకు ప్రపంచాన్ని కుదిపేసిన కేసు ఏదైనా ఉందా అంటే.. హీరో అల్లు అర్జున్ కేసు. పుష్ప – 2 సినిమా రిలీజ్ ఏమో కానీ, ఈ కేసు గురించే సర్వత్రా చర్చ సాగింది.

రోజుకొక ట్విస్ట్ ఇస్తూ సాగిన కేసుతో టాలీవుడ్ అంతా ఏకమైందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం టాలీవుడ్ మొత్తం బన్నీ ఇంటి దారి పట్టగా, తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబసభ్యులను పరామర్శించలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అల్లుఅర్జున్ కేసు అలాగే న్యాయస్థానంలో సాగుతోంది.

ఇప్పుడు తెరపైకి వచ్చి హల్చల్ చేస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే బెట్టింగ్. ఈ బెట్టింగ్ వ్యవహారంలో ముందు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ పేర్లు తెరపైకి వచ్చారు. ఆ తర్వాత బెట్టింగ్ సెగ రోజురోజుకు షరా మామూలుగానే టాలీవుడ్ కు తాకుతోంది. చేతినిండా సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు ఉన్న వారు కొందరు అనధికార బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సీరియస్ గా మారింది. విలక్షణ నటుడిగా, సామాజిక అంశాలపై ప్రశ్నించే ప్రకాష్ రాజ్ పేరు వినిపించడంతో అందరూ షాక్ తిన్నారు.

అంతేకాదు మంచు లక్ష్మీ, యాంకర్ సినీ ఆర్టిస్ట్ శ్రీముఖి, ఇలా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా సినీ నటుడు అలీ భార్య జుబేదా పేరు వినిపించడం సంచలనంగా మారింది. జుబేదా కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈమె కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఫేమ్ ను వృథా చేసుకొనే చర్యల్లోనే టాలీవుడ్ కు మచ్చ వచ్చిందని, కాస్త ఆలోచించి అడుగులు వేస్తూ ఫేమ్ కాపాడుకోవాలని పలువురు కోరుతున్నారు.

అలాగే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు టాలీవుడ్ ను గాడిలో పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించేవారని, ఆయన మరణంతో ఆ ప్లేస్ ఖాళీగానే ఉందని, అదే ఇన్ని తిప్పలు, మచ్చలకు ప్రధాన కారణం అంటున్నారు కొందరు. మెగాస్టార్ చిరంజీవి గతంలో పెద్దన్న పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపినా, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఎవరింటికి వారే పెద్ద అయినప్పటికీ, కాస్త తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయి దిగజారకుండా ఉండాలంటే ఎవరో ఒకరు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందట. నటుల మధ్య సఖ్యత తగ్గేందుకు కూడా ఇదొక కారణమని తెలుస్తోంది. ఇంటికి పెద్ద ఉంటేనే అంతా  మంచిగా సవ్యంగా సాగుతుందని, ఇల్లు లాంటి టాలీవుడ్ కు పెద్దన్న కొరత ఉందని చర్చ సాగుతోంది.

Also Read: ‘హత్య’ డైరెక్టర్‌పై కేసు నమోదు.. మరో ఇద్దరిపై కూడా..

మా అసోసియేషన్ ఉన్నప్పటికీ, తనదైన శైలిలో నటులకు విపత్కర పరిస్థితుల్లో అండగా ఉంటోంది. కానీ పెద్దన్న అనే స్థాయి వ్యక్తి ఉంటే, కాస్త అందరికీ భయం ఉంటుందని, అందుకే ఏదొక వివాదం టాలీవుడ్ చుట్టే తిరుగుతుందని కొందరు చర్చించుకుంటున్నారు. మరి బెత్తం పట్టుకొని భయపెడుతూ.. టాలీవుడ్ ను నడిపించే పెద్దన్న పోస్ట్ భర్తీ ఎప్పుడో కానీ, అప్పటివరకు ఆగాల్సిందే.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు