Nara Lokesh:
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడా తగ్గాలో చూపించాడు

Nara Lokesh:  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలు చెబుతుంటారు. కొందరు కార్యకర్తలు మాత్రం అతిగా ప్రవర్తించి, అనాలోచిత నిర్ణయాలతో భవిష్యత్ నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇది ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు వర్తిస్తుంది. ఒక పార్టీలో ఏళ్ల తరబడి నమ్మకంగా ఉండి అకస్మాత్తుగా పార్టీ మార్చి తిట్టడం మొదలు పెట్టిన నేతలు కోకొల్లలు. అవతలి పార్టీలో ఉండి ఏళ్లుగా విమర్శిస్తున్న వారు సడెన్‌గా ఈవైపున చేరి జై కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కానే కాదు. కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోవాల్సిందే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల అభీష్టం మేరకు నడుచుకొని తీరాల్సిందే. ఈ విషయాలన్నీ టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన పని చూస్తుంటే ఈ నానుడిని బాగా ఒంటపట్టించుకున్నట్లుగానే కనిపిస్తున్నారు.

అయ్యో పాపం.. వైసీపీ!
వాస్తవానికి నారా లోకేష్‌కు, టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR)కు అస్సలు పడట్లేదని, ఇదే పరిస్థితి చంద్రబాబు-జూనియర్ మధ్య కూడా ఉందని ఎప్పట్నుంచో వదంతులు ఉన్నాయి. దీనికి అటు టీడీపీ, ఇటు జూనియర్ ఫ్యాన్ వార్ ఉండటంతో అది కాస్త పెద్ద రాద్ధాంతమే అయ్యింది. మరీ ముఖ్యంగా టీడీపీ కార్యక్రమాల్లో జై ఎన్టీఆర్.. జైజై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం, ప్లక్లార్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు హడావుడి చేయడాన్ని కూడా పార్టీ పెద్దలు కొందరు తీవ్రంగా తప్పుబట్టి, క్లాస్ తీసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీన్నే అవకాశంగా తీసుకున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఏ రేంజిలో హడావుడి చేశారో అందరికీ తెలిసే ఉంటుంది. అంతేకాదు దగ్గరుండి మరీ ఇరువురి అభిమానుల మధ్య గొడవలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా నూజివీడులో జరిగిన అశోకలేలాండ్ ప్రారంభోత్సవంలో కార్యకర్తల కోరిక మేరకు ఎన్టీఆర్ ఫ్లెక్సీ చేతబట్టి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, జూనియర్ వీరాభిమానులను లోకేష్ ఉత్సాహపరిచారు. ఈ ఒక్క సీన్ ఇప్పుడు టీడీపీ ప్రత్యర్థులకు, ఇన్నాళ్లు అభిమానుల మధ్య రచ్చపెట్టిన వైసీపీ కార్యకర్తలు, నేతలకు నిద్రపట్టడం లేదట. అందుకే అయ్యో పాపం.. వైసీపీ అంటూ ఎన్టీఆర్, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా జాలిపడుతున్నారు.

ఎప్పుడు పార్టీకి అవసరమున్నా..
స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలో మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ది కూడా చెరగని స్థాయి అని అభిమానులు చెబుతుంటారు. ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఆ స్థాయిని, ఆయన స్థానాన్ని ఎవరూ చెరపలేరని గర్వంగా నందమూరి ఫ్యాన్స్ అప్పుడప్పుడూ హడావుడి చేస్తుంటారు. అంతేకాదు అభిమానుల్లో ఆయనపై ఉన్న ప్రేమనూ ఇప్పటికి, ఎప్పటికీ చెరపలేరు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు పార్టీ కోసం ఎన్నికల ప్రచారం చేసిన బుడ్డోడు, తన అవసరం పార్టీకి ఎప్పుడున్నా సరే నిమిషాల్లో వాలిపోతానని ప్రకటించారు కూడా. ఆ సమయం, సందర్భం ఎప్పుడు వస్తుందో అని అభిమానులు వేచి చూస్తున్నారు. మరోవైపు పరిస్థితి, సందర్భాన్ని బట్టి పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో, శుభ సందర్భాల్లో ఎన్టీఆర్ స్పందిస్తూనే ఉంటారు. ఇక టీడీపీ మీటింగుల్లో ఎన్టీఆర్ పేరు, నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి.. ఫ్లెక్సీలు, బ్యానర్లు అయితే ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ జూనియర్- లోకేష్, చంద్రబాబు మధ్య అంతగా సత్సంబంధాలు లేవనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తూనే ఉంది. అయితే వాటన్నింటికీ అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో నారా లోకేష్ చెక్ పెట్టేశారు. దీంతో అభిమానుల్లో నూతనోత్సాహం వచ్చినట్లు అయ్యింది. ఎన్టీఆర్-లోకేష్ ఒక్కటి కాబోతున్నారని టీడీపీలో, రాష్ట్ర రాజకీయాల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది.

ఎక్కడ నెగ్గాలో కాదు..
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన లోకేష్‌ను స్వాగతించడానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా, కొందరు ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకుని నిల్చొని ఉన్నారు. అయితే ఆ ఫ్లెక్సీని పట్టుకోమని కొందరు అభిమానులు లోకేష్‌ను కోరగా ఎలాంటి కోపం, అసహనం, అసంతృప్తి ప్రదర్శించకుండా చిరునవ్వుతోనే తారక్ ఫ్లెక్సీని పట్టుకొని అభివాదం చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే మేధావులు, రాజకీయ విశ్లేషకులు ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన నాయకుడు’ అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇక లోకేష్ పరిణతి చూసి బుడ్డోడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లోకేష్ తన రాజకీయ చతురతను, నందమూరి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఎన్టీఆర్ ఫ్లెక్సీని గట్టిగా పట్టుకుని, కార్యకర్తల స్ఫూర్తిని ఆకాశానికి ఎత్తేశారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్‌ను లోకేష్ కాకపడుతున్నారనే విమర్శలూ వస్తున్నాయి. త్వరలోనే టీడీపీ భాధ్యతలు ఎన్టీఆర్ చేపట్టబోతున్నారా? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరోవైపు 2029 ఎన్నికలకు పందెంకోళ్లు ఎన్టీఆర్, లోకేష్ అంటూ చెబుతున్న వాళ్లూ ఉన్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందు బుడ్డోడికి కీలక బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ ఒక్క ఫ్లెక్సీ ఎంత చర్చకు దారి తీసిందో చూశారు కదా!

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?