Jupally Krishna Rao: రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి నూతన పర్యాటక విధానాన్ని రూపొందించామని, ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పర్యాటక అభివృద్ధిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానం ఇచ్చారు. ఆలయాలు, పర్యావరణం, సాహస, జల క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
Also read: Karimnagar district: అకాల వర్షాలతో అపార నష్టం.. కన్నీరు పెడుతున్న కర్షకులు
పర్యాటక రంగంలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్శించడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రాబట్టడం, పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు వివరించారు.
Also read: CM Revanth Reddy: రంగంలోకి సీఎం రేవంత్.. భారీగా ఉన్నతాధికారుల బదిలీలు?
గత పదేండ్లలో ఎలాంటి పర్యాటక పాలసీ లేదని, పర్యాటక అభివృద్ధికి 5 సంవత్సరాల దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుని ప్రణాళికబద్ధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. నూతన పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి, సమీక్షలు నిర్వహించి, అభివృద్ధికి కార్యచరణను సిద్దం చేస్తామని వెల్లడించారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/3988644/TG-Edition/Swetcha-daily-TG-epaper-21-03-2025#page/1/1