స్వేచ్ఛ కరీంనగర్: Karimnagar district: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. పెట్టుబడులు అన్ని పూర్తయి పంట చేతికి వస్తుందనుకున్న తరుణంలో కురిసిన వడగళ్ల వాన అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాన్ని పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న తో పాటు మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. పలుచోట్ల కూరగాయ పంటలతో పాటు చేతికొచ్చిన మిర్చి శాతం వర్షానికి తడవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Police Officer Dies: పోలీస్ ఆఫీసర్ ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు..
ఉమ్మడి జిల్లాలో వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే మామిడి పంట దిగుబడిలో తగ్గుతాయాని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అకాల వర్షాలకు మామిడి పూత పిందె రాలిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి నీటి ఎద్దడి ముందుగానే గ్రహించి ఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేయగా ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలవాలింది. పలు గ్రామాల్లో మిర్చి చేతికి రాగా రైతులు కల్లాల్లో ఆరబెట్టారు వడగళ్ల వర్షానికి పలుచోట్ల మిర్చి తడిసి ముద్ద కావడంతో పాటు రంగు మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వరి పంట పొట్ట దశలో ఉండడంతో వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రధాన పంటలతో పాటు పత్తి కూరగా యలు వంటి పంటలు సైతం అకాల వర్షానికి దెబ్బతిన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అంచనా వేసే పనిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. పడగల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు