తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : RIDF scheme CM Revanth: నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన సహకారంపై పరస్పరం చర్చించుకున్నారు. ఆర్ఐడీఎఫ్ (రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్) స్కీమ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని, సహకార సొసైటీలను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తవాటిని ఏర్పాటు చేయాలని కోరారు.
స్వయం సహాయక మహిళా బృందాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించి ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇందిరా క్రాంతి పథం, గోడౌన్లు రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి మిల్లింగ్ కెపాసిటీని పెంచేందుకు సహకరించాలని కోరారు. ఈ భేటీ అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్‌ల నిధులు మార్చి 31 లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
Also read: TG Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాబోయే నోటిఫికేషన్స్ ఇవే..
నాబార్డు పరిధిలోని స్కీమ్‌లన్నింటినీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం నొక్కిచెప్పారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నాబార్డ్ చైర్మన్‌ను కోరారు. ఇదే సమయంలో కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఆయన ప్రతిపాదించారు.
Also read: Chamala Kiran Kumar Reddy: పదేళ్లు ముంచారు.. ఇప్పుడు మండి పోతున్నారు.. ఎంపీ చామల
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/3988644/TG-Edition/Swetcha-daily-TG-epaper-21-03-2025#page/1/1