Hero Karthi (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Karthi: కార్తీని చూసి నేర్చుకోండయ్యా.. టాలీవుడ్ హీరోలపై కౌంటర్స్

Karthi: తమిళ హీరో కార్తీకి రావాల్సిన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది. నిజంగా ఒక స్టార్ హీరో రేంజ్‌ని ఆయన ఎప్పుడో దాటేశాడు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా స్టార్ రేంజ్ తర్వాత ఇంకా ఏమైనా ఉంటే అదే కార్తీ అని చెప్పొచ్చు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ అని కొట్టుకుంటూ ఉంటారు కానీ.. సూర్య, కార్తీ విషయానికి వస్తే అందరూ ఇష్టపడతారు. అసలు ‘ఖైదీ’ సినిమాలో ఢిల్లీగా కార్తీ చేసిన యాక్టింగ్‌కు నేషనల్ అవార్డు పడాలి. అలా ఉంటుంది యాక్టింగ్. ఇక కార్తీ చేసే సెంటిమెంట్ చిత్రాల గురించి చెప్పేదేముంది. రియలిస్టిక్‌గా, ఎంతో అందంగా, హృద్యంగా ఉంటాయి అలాంటి చిత్రాలు. రీసెంట్‌గా వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా కూడా కార్తీ యాక్టింగ్‌ గ్రేట్‌నెస్‌ని తెలియజేసింది.

Also Read- Robinhood: ‘గ్రోక్’ చెప్పిందే జరిగింది.. ఫైనల్‌గా డేవిడ్ వార్నర్‌కు లింక్ పెట్టారుగా!

అలా అని లవ్ స్టోరీస్ చేయలేదని అనుకుంటున్నారేమో.. ‘ఆవారా’ సినిమాలోని పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అలా జోనర్ ఏదైనా, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కార్తీకి వెన్నతో పెట్టిన విద్య. ‘ఒరేయ్ ఎవుర్రా మీరంతా’ అనే డైలాగ్ ఇంకా కొన్ని తరాలు చెప్పుకుంటాయంటే అతిశయోక్తి కానే కాదు. అలాంటి గొప్ప నటుడు కార్తీ. అసలిప్పుడిదంతా ఎందుకని అనుకుంటున్నారు కదా.. అసలు విషయం లోకి వస్తే..

కార్తీ కొన్ని రోజుల కిందటి వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో కార్తీ కరగాట్టం అనే నృత్యం చేస్తున్నారు. తమిళనాడులో దేవుడి ముందు తిరునాళ్లలో ఈ నృత్యం ఎక్కువగా ఆడుతుంటారు. ఈ నృత్యం చేస్తున్న వారితో కలిసి కార్తీ కూడా సేమ్ టు సేమ్ స్టెప్ కలపడం, మధ్యలో ఇద్దరు లేడీస్‌ని కూడా పిలిచి నృత్యం చేయమంటే, వెంటనే వారు కూడా ఆడటం.. మొత్తంగా ఈ వీడియో మళ్లీ మళ్లీ వైరల్ అవుతూనే ఉంది. ఈ వీడియోలో ఆయన సింప్లిసిటీని అంతా ప్రశంసిస్తున్నారు. ఇలా ఎలా సాధ్యం అన్నా, ఇంత సింపుల్‌గా అసలు ఎలా ఉంటావ్? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అంతేనా? ఈ వీడియోకు మన తెలుగు హీరోలను లింక్ చేస్తూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మన తెలుగు హీరోలు ఎవరైనా ఇలా ఉంటారా? ఇలా చేస్తారా? కార్తీ చూడండి ఎంత గొప్పగా కలిసిపోయాడో. కార్తీని చూసి నేర్చుకోండయ్యా.. జనం ఉన్నారని కూడా చూడకుండా, సెక్యూరిటీ సమస్యలు లేకుండా, నార్మల్ పర్సన్‌లా కలిసిపోయి డ్యాన్స్ చేస్తున్నాడు. ఎటువంటి ఇగో, భేదాలు లేకుండా ఇలా ఉండే స్టార్స్ చాలా అరుదు అంటూ కార్తీని కొనియాడుతున్నారు.

Also Read- Oh Bhama Ayyo Rama: సుహాస్ సినిమాకు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

మరోవైపు ఇటీవల జరిగిన శ్రీవారి లడ్డు విషయంలో కూడా కార్తీ ఏదో అన్నట్లుగా వార్తలు వస్తే వెంటనే ఆయన రియాక్ట్ అయిన తీరును కూడా గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా, చూడగానే ఒక తెలుగు హీరో ఫీల్ వచ్చే అతి కొద్ది మంది నటుల్లో కార్తీ టాప్ ప్లేస్‌లో ఉంటాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదని అంతా ఘంటాపథంగా చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..