అమరావతి స్వేచ్ఛ: AP Govt Employees: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉద్యోగులకు మొత్తం రూ.6,200 కోట్లు చెల్లించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీపీఎస్, ఏపీజీఏఐ కింద ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేయనుంది.
ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కీలక ఆదేశాలు..
సీఎం ఆదేశాలతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గురువారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని డ్రెయిన్లలో సిల్ట్ తొలగించాలని సూచించారు.సిల్ట్ తొలగింపుపై ప్రతి వారం నివేదికలు పంపించాలని ఆదేశించారు.
Also Read: Nara Lokesh vs Botsa: అంతా మీరే చేశారు.. వైసీపీపై లోకేష్ గరంగరం..
చెత్త డంపింగ్ సైట్లలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినంగా వ్యవహరించాలని సురేష్ కుమార్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఒక మోడల్ స్వర్ణాంధ్ర పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా పచ్చదనం, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, స్వచ్ఛాంధ్ర ప్రచారాన్ని నిజమైన ప్రజల కార్యక్రమంగా రూపొందించాలని సురేష్ సూచించారు.