TG on Tax Evasion (imagecredit:twitter)
తెలంగాణ

TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై సర్కార్ సీరియస్.. పెద్ద ప్లాన్ రెడీ.

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై ప్రభుత్వం సీరియస్ దృష్టి సారించింది. ఖజానాకు చేరాల్సిన నిధులు దారి తప్పకుండా పకడ్బందీ మెకానిజం రూపొందించే కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకోవాలనుకుంటున్నది. రాష్ట్ర అవసరాలు తీరేందుకు సొంత ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడాలనుకుంటున్నది. రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే రుణాలన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పుల్లోని ‘అసలు’, వాటిమీద కట్టాల్సిన వడ్డీలకే సరిపోతున్నందున స్వీయ ఆర్థిక వనరులే ఏకైక మార్గమనే అభిప్రాయాని వచ్చింది. అందులో భాగంగానే రాష్ట్రంలో వివిధ రకాల పన్నుల వసూళ్ళు ఎగవేతకు ఆస్కారం లేకుండా ఖజానాకు చేరాల్సిందేననే స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.

గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మేర జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి రావాల్సి ఉన్నా అధికారుల కుమ్మక్కుతో అక్రమాల జాబితాలోకి చేరిపోయిన తర్వాత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.ఈ విషయాలన్నింటినీ తాజాగా విడుదలైన సోషియో ఎకనమిక్ సర్వేలోనే ప్రభుత్వం వెల్లడించింది. పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు, సంస్థలను గుర్తించి క్రమం తప్పకుండా వసూలు చేసే మెకానిజాన్ని రూపొందించనున్నట్లు స్పష్టత ఇచ్చింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తృతం చేయాలని, టాక్స్ బేస్‌ను పెంచుకోవాలని, అందుకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థను నెలకొల్పుకోవాలని వివరించింది.

Also Read: Rajiv Yuva Vikasam Scheme: రేషన్ కార్డు కావాలి సార్.. ప్లీజ్ త్వరగా ఇవ్వండి..

జీఎస్టీ, వాణిజ్య పన్నుల విభాగాలు దీనిపై దృష్టి పెట్టి ఎగవేతకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని వివరించింది. రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చే అన్ని మార్గాలను అన్వేషించాలని సంబంధిత శాఖల అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల (కార్పొరేషన్లు)పై దృష్టి పెట్టాలని, అక్కడే ఎక్కువగా లీకేజీలు ఉన్నాయని, వాటిని కట్టడి చేస్తూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేలా వ్యూహాలను రూపొందించుకోవాలని స్పష్టం చేసింది.

పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు, కంపెనీలు ఏవి రానివి ఏవి అనే విషయంలో రెవెన్యూ సమకూర్చే విభాగాలు స్పష్టతకు రావాలని ప్రభుత్వం నొక్కిచెప్పింది. ఆర్థిక వనరుల సమీకరణపై గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అనేక పర్యాయాలు సీఎం, డిప్యూటీ సీఎం రెవెన్యూ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ అవకతవకలు, కుంభకోణం, ప్రభుత్వ ఖజానాకు రాకుండా ఆగిపోయిన వ్యవహారం తదితరాలపై ఆరా తీశారు.

ఇసుక సహా వివిధ రకాల ఖనిజాల తవ్వకాలు, సీవరేజి ఛార్జి, రాయల్టీ, లైసెన్సు ఫీజు, అక్రమ రవాణా, అనుమతికి మించి జరుగుతున్న మైనింగ్ యాక్టివిటీస్ వీటిపై ఆరా తీసిన సీఎం, డీప్యూటీ సీఎం… సంబంధిత శాఖల అధికారులు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, రికార్డులను పరిశీలించాలని ఆదేశించారు. అందులో భాగంగానే ఇటీవల జిల్లాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా తదితరాలపై జిల్లా కలెక్టర్లు కూడా రెగ్యులర్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read: Kaloji Narayana Rao University: ఫలించిన ‘స్వేచ్ఛ’ కృషి .. వీసీని మార్చిన ప్రభుత్వం

ఇసుక రీచ్‌ల మొదలు స్టోరేజీ యార్డుల వరకు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు, స్టాక్ రిజిస్టర్ల తనిఖీలు, ఎంట్రీ-ఎగ్జిట్ గేట్ల ఏర్పాటు, అక్రమాలపై పెనాల్టీ విధించడం ఇలాంటి అనేక అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకుని అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకూ రోజుకు కోటిన్నర రూపాయల మేర ప్రభుత్వానికి ఇసుకపై ఆదాయం వస్తూ ఉంటే ఈ చర్యలు చేపట్టిన తర్వాత రెట్టింపు ఆదాయం సమకూరి రూ. 3 కోట్లకు చేరుకున్నదని, సత్ఫలితాలు వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఇకపైన కూడా ఈ చర్యలు కొనసాగుతాయని నొక్కిచెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయం వస్తుందనే ఆశలు లేని పరిస్థితుల్లో సొంత ఆదాయంపైనే ఆధారపడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. గొప్పల కోసం కాకుండా వాస్తవిక బడ్జెట్‌ను సమర్పించామంటూ చెప్పుకుంటున్నందున స్వీయ ఆర్థిక వనరులను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. కొత్తగా చేసే అప్పులేవీ రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అవసరాలకు వినియోగించడంలేదని, గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలకే సరిపోతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీంతో సొంత ఆదాయమే శ్రీరామరక్ష అనే అభిప్రాయంతో బడ్జెట్‌లో వేసుకున్న అంచనాలకు తగినట్లుగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది. పన్ను ఎగవేతలపై కఠినంగానే వ్యవహరించనున్నది

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..