Megastar Chiranjeevi Twitter X Post
ఎంటర్‌టైన్మెంట్

Megastar Chiranjeevi: మాటలు సరిపోవు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవే మాటలు సరిపోవు అన్నారంటే.. ఆయన హృదయం ఎంత ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా ఇదే విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ వేదికగా తెలిపారు. మార్చి 19, బుధవారం మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిన విషయం తెలిసిందే. యుకె పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లోని కొందరు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అండర్ సెక్రటరీ‌లు, దౌత్యవేత్తలంతా కలిసి మెగాస్టార్ చిరంజీవిని సత్కరించారు. ఇదే సమయంలో.. బ్రిడ్జి ఇండియా అనే యూకేకి చెందిన సంస్థ నుంచి సాంస్కృతిక నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ప్రజాసేవకుగానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. బ్రిడ్జి ఇండియా సంస్థ ఒక వ్యక్తికి, అందునా ఒక తెలుగు వాడికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇలాంటి అరుదైన అవార్డు మెగాస్టార్‌ను వరించడమనేది అసాధారణ గౌరవంగా చెప్పుకోవచ్చు. తను ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా మనసులోని మాటలను పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

Also Read- Prakash Raj: పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నాకు ఎటువంటి నోటీసు రాలేదు.. వస్తే చెబుతా!

‘‘హౌస్ ఆఫ్ కామన్స్ – యుకె పార్లమెంట్‌లోని కొందరు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అండర్ సెక్రటరీ‌లు, దౌత్యవేత్తలచే గౌరవించబడటమనేది ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నిజంగా నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సభ్యులందరూ నాపై గౌరవ భావాన్ని చూపిస్తూ మాట్లాడిన మాటలకు నేను ధన్యుడిని. బ్రిడ్జి ఇండియా బృందం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవటం నన్నెంతగానో ఉత్సాహపరిచింది. ఈ గౌరవం నాకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది.

ఈ క్షణం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. నాపై ప్రేమాభిమానాలను చూపించే అభిమానులు, రక్త దాతలు, నా సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ నా ఈ ప్రయాణంలో ఎంతగానో సహకరించిన వారు, నేను మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై మీకు ఉన్న ప్రేమ, అభిమానాన్ని చూపిస్తూ, అభినందిస్తూ.. ఎన్నో మెసేజ్‌లు పంపారు. వారందరికీ ప్రేమతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read- Telangana State Women Commission: సినిమా పాటల్లో డాన్స్ స్టెప్స్‌పై మహిళా కమిషన్ వార్నింగ్.. ఎవరికో అర్థమైందా రాజా?

లండన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సర్ స్టీఫెన్ టిమ్స్, నవేందు మిశ్రా, సోజన్ జోసెఫ్, డేవిడ్ పింటో, ఉమా కుమారన్, గురిందర్ సింగ్ జోసన్, బగ్గీ షంకర్ లేదా భగత్ సింగ్ షంకర్, డానీ బీల్స్, డీడ్రే కాస్టిగన్, లార్డ్ సహోతా, బాబ్ బ్లాక్‌మన్, వీరేందర్ శర్మ, ఉదయ్ నాగరాజు, గారెత్ విన్ ఓవెన్, సీమా మల్హోత్రా వంటి ప్రముఖులందరూ మెగాస్టార్‌తో సంభాషించి, అభినందించారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ ఇండియాకు చెందిన ప్రతీక్ దత్తాని, అమన్ ధిల్లాన్‌లకు మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతోంది. మెగాభిమానులందరూ ఆయన పోస్ట్‌ను రీ ట్వీట్‌లో చేస్తూ.. మరోసారి అభినందనలు తెలియజేస్తున్నారు.

ఆ ప్రవర్తను తీవ్రంగా ఖండిస్తున్నా..
‘‘యూకేలో నన్ను కలవాలని మీరు చూపించిన ప్రేమ, అభిమానం నన్ను ఎంతగానో కదిలించింది. అయితే, కొంతమంది వ్యక్తులు ఫ్యాన్స్ మీటింగ్ అంటూ అమౌంట్ వసూలు చేసినట్లుగా నా దృష్టికి వచ్చింది. నేను ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా అలా అమౌంట్ వసూలు చేసి ఉంటే అది వెంటనే తిరిగి ఇచ్చేయండి. దయచేసి ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి చర్యలను సమర్థించనని తెలుసుకోండి. మన మధ్య ఉన్న ప్రేమ, అభిమానాల బంధం అమూల్యమైనది. దానిని ఎవరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చుకోలేరు. మన బంధాలను, చర్చలను ఎలాంటి దోపిడీ లేకుండా జెన్యూన్‌గా ఉంచండి.’’ అని చిరంజీవి కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!