జగిత్యాల స్వేచ్ఛ: Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో లబ్ధిదారులు, యువకులు ,నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద అన్ని కులాల వారికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలి ప్రభుత్వం నిర్నయించింది. లబిద్దారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌ను బట్టి మొత్తం వ్యయంలో 60 శాతం నుంచి 80 శాతం సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చి 5 నుండి ఏప్రిల్ 6 వ తేది వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజైన జూన్ 6 న లబ్ధిదారుల ప్రకటన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది, ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు , ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అలాగే బ్యాంకు పాస్ బుక్ అవసరం కాగా ఇందులో రేషన్ కార్డు కీలకంగా ఉన్నది. కుటుంబంలో ఒకరికి పథకం వర్తిస్తుందని ఉండడంతో రేషన్ కార్డు ప్రామాణికంగా మారింది.
Also Read: Ramakrishna Rao: ఈ అధికారి లెక్క వేస్తే.. ఆల్ సెట్ కావాల్సిందే.. ఆయనెవరంటే?
రేషన్ కార్డు లేని యువకుల దరఖాస్తు ఆన్ లైన్లో తీసుకోపోవడంతో ఆంteదోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికాకంలో ఉన్న సమయంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి మూడుసార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. జగిత్యాల జిల్లాలో సుమారు 10 వేల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
గతంలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని గ్రామ సభలు పెట్టి లబ్ధిదారుల పేర్లు ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. లబ్ధిదారుల పేర్లు ప్రకటించిన ప్రభుత్వం కార్డుల జారీలో జాప్యం చేస్తుండటంతో ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందించి రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హత కల్పించాలని యువకులు కోరుతున్నారు.
Also Read: New Liquor Brands: కిక్కే.. కిక్కు.. విదేశీ బ్రాండ్స్ కు మరో అవకాశం..