New Liquor Brands(image cedit:X)
తెలంగాణ

New Liquor Brands: కిక్కే.. కిక్కు.. విదేశీ బ్రాండ్స్ కు మరో అవకాశం..

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: New Liquor Brands: తెలంగాణలో లేని కొత్త విదేశీ, దేశీయ బ్రాండ్లను అమ్ముకోవటానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీ వరకు ఆయా కంపెనీలు అప్లికేషన్లు పెట్టుకోవాలని ఎక్సయిజ్​ అధికారులు సూచించారు. అయితే, కంపెనీల అభ్యర్థనలతో ఈ గడువును ఏప్రిల్​ 2వ తేదీ వరకు గడువును పెంచారు.

Also read: Hyderabad News: వెళ్తున్న కారులో మంటలు.. షార్ట్ సర్క్యూట్ కారణమా?

తెలంగాణలో లేని బ్రాండ్లను విక్రయించాలనుకునే కంపెనీలు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో 39 కంపెనీలు స్పందించాయి. అయితే, టీజీబీసీఎల్​ లో రిజిష్టర్​ కాని ఈ కొత్త కంపెనీలు ఇతర రాష్ర్టాల్లో జరుపుతున్న తమ మద్యానికి సంబంధించి నాణ్యతా ప్రమాణాలు, ఆయా బ్రాండ్లపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేయాలని ఎక్సయిజ్​ అధికారులు పేర్కొన్నారు.

ఈ సర్టిఫికెట్లను జత చేయటంలో మరికొంత సమయం పడుతుందని చెప్పిన ఆయా కంపెనీలు గడువును పెంచాలని కోరాయి. ఈ క్రమంలోనే దరఖాస్తుల గడువును ఏప్రిల్​ 2వ తేదీ వరకు పెంచుతున్నట్టు ప్రొహిబిషన్​, ఎక్సయిజ్​ కమిషనర్​ చెవ్యూరు హరికిరణ్​ తెలిపారు.

Also read: Social Media Influencers: బెట్టింగ్ భూతం.. అసలు సూత్రధారులెవరు? వీరు నోరు విప్పేనా?

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు