Naga Chaitanya and Sobhita (Image Source: VOGUE India Insta)
ఎంటర్‌టైన్మెంట్

Chaitu – Sobhita: మ్యాగజైన్ కవర్ పేజీపై కొత్త జంట.. చైతూ ఎలా పడేశాడో చెప్పేసిన శోభిత!

Chaitu – Sobhita: నూతన జంట అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), శోభితా ధూళిపాల (Sobhita Dhulipala) వరల్డ్ టాప్ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేశారు. ఆ మ్యాగజైన్ కవర్ పేజీ ఫొటో ప్రస్తుతం విడుదలై వైరల్ అవుతోంది. ఈ జంటను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే, వారు ఈ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోజులు మాత్రం వారిపై ట్రోలింగ్‌కు కారణం అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య పరిస్థితి ఏంటని అంతా అనుకున్నారు. కానీ కొన్ని నెలలకే ఆయన శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లుగా కొన్ని ఫొటోలు లీకయ్యాయి. అంతే, అప్పటి నుంచి వారిద్దరూ తరుచూ వార్తలలో నిలుస్తూనే వచ్చారు.

Also Read- Chiru-Anil: చిరంజీవి – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఫిక్సయిందా?

మొదట్లో స్నేహంగా మొదలైన వారి పరిచయం ఆ తర్వాత లవర్స్‌గా మారే వరకు వెళ్లింది. ముంబైలో ఉండే శోభిత కోసం చైతూ అక్కడకు వెళ్లడం, అలా వెళ్లినప్పుడు ఏదో ఒక చోట ఫొటోలకు దొరికిపోవడంతో వారి మధ్య బంధం బయటకు వచ్చింది. ఎప్పుడైతే వారి బంధంపై వార్తలు బయటికి వచ్చాయో.. ఇంక ఆలస్యం చేయకూడదనుకున్నారు. వెంటనే పెద్దలకు చెప్పి.. వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే, ఇంత ఎపిసోడ్‌లో అసలు శోభితను చైతూ ఎలా పడేశాడనే అనుమానం ఇప్పటికీ అందరిలో ఉంది. ఆ అనుమానాన్ని ఈ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత తీర్చేసింది. అవును చైతూతో పరిచయం ఎలా ఏర్పడిందో, అది ప్రేమగా మారి, పెళ్లి వరకు ఎలా వెళ్లిందో.. అన్నీ డిటైల్డ్‌గా చెప్పేసింది శోభిత. ఆ మ్యాటర్‌లోకి వస్తే..

">

‘తండేల్’ సినిమా, ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు పూర్తవుతాయో అని ఈ జంట ఎంతగా వేచి చూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఇన్‌స్టాలో హమ్మయ్యా.. ఇక గడ్డంలేని చైతూని చూడొచ్చు అని శోభిత తన సంతోషాన్ని తెలియజేసిందంటే.. వారి వైవాహిక జీవితానికి ‘తండేల్’ ఎంతగా బ్రేక్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ‘తండేల్’ సక్సెస్ కొట్టి, వంద కోట్ల క్లబ్‌లో చేరిందో.. ఆ వెంటనే ఈ జంట తమ ప్లాన్‌ని అమలు చేశారు. వీరిద్దరూ కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్‌లో ఉన్న విషయం తెలిసిందే. యూరప్ ట్రిప్‌లో ఉన్న వీరిద్దరూ అనేక ప్రాంతాలలో సంచరిస్తూ హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలా, వరల్డ్ టాప్ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజీ కోసం వీరిద్దరూ ఫొటోషూట్ కూడా చేశారు. ఇక ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో.. మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందనే ప్రశ్నకు శోభిత సమాధానమిస్తూ..

Also Read- Rashmika Mandanna: ‘సికిందర్’తో స్టెప్పులు.. రష్మిక ఖాతాలో ఇంకోటి వేసుకోవచ్చా!

‘‘మొదట చైతూని సోషల్ మీడియాలో చూశాను. అతని ప్రొఫైల్ చూస్తే కేవలం 70 మంది మాత్రమే ఫాలోయర్స్ ఉన్నారు. అప్పుడు నేను కూడా ఫాలో కొట్టా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారడానికి పెద్దగా కారణాలు కూడా ఏం లేవు. సింపుల్‌గానే మా మధ్య ప్రేమ మొదలైంది. తన ఇష్టాలను నా ఇష్టాలుగా, నా ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకున్నాం. తెలుగు భాషే మా ఇద్దరి మధ్య బంధాన్ని మరింతగా పెంచింది. చైతూకి తెలుగు అంటే చాలా ఇష్టం. నన్ను తెలుగు మాట్లాడమని అనేవాడు. అలా మా ఇద్దరి స్నేహబంధం ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత అందరికీ తెలిసిందే’’ అంటూ శోభిత చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?