Manchu Manoj on Mohan Babu Birthday (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Manchu Manoj: మోహన్ బాబు బర్త్‌డే.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

Manchu Manoj: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లుగా వారి ఇంట్లో అస్సలు ప్రశాంతత అనేది కరువైంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మోహన్ బాబు తన ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలతో బాగా అలసిపోయారు. ఆ విషయం ఆయన విడుదల చేస్తున్న లేఖలు చూస్తుంటేనే తెలుస్తుంది. అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది సరైన క్లారిటీ అయితే ఇంత వరకు రాలేదు. ఒకసారి ఆస్తి గొడవలు, మరొకసారి ఆధిపత్య పోరు, ఇంకోసారి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై పోరాటం అన్నట్లుగా రకరకాలుగా పిక్చర్ కనిపిస్తున్నా.. విషయం మాత్రం వేరే ఏదో ఉంది అనే దానిపై అయితే అందరికీ ఓ క్లారిటీ ఉంది.

Also Read- Betting Apps: మరో ఆరుగురికి నోటీసులు.. అందులో యాంకర్ శ్యామల కూడా!

ఇంకా.. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం, ఆయన చేసుకున్న సంబంధం మిగతావాళ్లకి నచ్చలేదంటూ ఒకసారి వార్తలు వస్తుంటాయి. మంచు మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆస్తులు.. చిన్న వాడైన మనోజ్‌కు ఇవ్వలేదనేలా మరోసారి.. ఇలా రకరకాలుగా వారి ఇంట్లోని సమస్యపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మంచు మనోజ్ చేసే పనులతో పరువు పోయినట్లుగా మోహన్ బాబు ఫీలవుతున్నారనేది మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అయితే తన తండ్రి మీద ఏం కోపం లేదంటూ, అంతా విష్ణు అండ్ టీమ్ అనేలా మంచు మనోజ్ చేసే పోరాటంలోనూ నిజాయితీ ఉందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిసారి ఏదో ఒక తిక్క పని చేసి, తనపై ఉన్న సానుభూతిని సైతం దూరం చేసుకుంటున్నాడు మంచు మనోజ్.

తండ్రి అంటే ప్రాణం అంటాడు. ఆయన కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తానంటాడు. మరో తను చేసే పనులతో ఆయన పరువు పోతుందనే విషయాన్ని మాత్రం మంచు మనోజ్ గమనించకపోవడం విశేషం. ఒక్కోసారి ఒక్కోలా రియాక్ట్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న మంచు మనోజ్, తన తండ్రి విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా తన తండ్రి అంటే తనకు ఎంత ప్రేమో చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా తన తండ్రి పుట్టినరోజున (HBD Mohan Babu) ఆయన పక్కన లేనందుకు ఎంతో బాధపడుతూ ఓ పోస్ట్ చేశాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ మంచు మనోజ్ ఏం పోస్ట్ చేశాడంటే..

Also Read- Sunita Williams Return: హీరోచితంగా భూమిపైకి.. సునీత విలియమ్స్ రిటర్న్‌పై సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఈ వేడుక రోజున మీ పక్కన లేనందుకు మేమంతా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. నాన్న, మీ దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఎప్పటికీ మీరే నా సర్వస్వం’’ అని మంచు మనోజ్ ‘యానిమల్’ సినిమాలో ‘ఫాదర్’ సాంగ్‌ని పోస్ట్ చేశారు. అలాగే తన చిన్నప్పటి ఓ రేర్ ఫొటోని కూడా ఈ పోస్ట్‌కు జత చేశాడు. ఇక ‘యానిమల్’ సినిమా సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా.. స్క్రీన్‌పై తన తండ్రితో ఉన్న హ్యాపీ మూమెంట్స్‌‌ని మనోజ్ ఇందులో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరి ఇంత ప్రేమను పెట్టుకుని, ఎందుకున్నా నీ పోరాటం, ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి కదా.. అంటూ అభిమానులు ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!