Sunita Williams Return (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sunita Williams Return: హీరోచితంగా భూమిపైకి.. సునీత విలియమ్స్ రిటర్న్‌పై సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!

Sunita Williams Return: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వారు దాదాపు 286 రోజులకు తిరిగి రావడంతో, అందులోనూ సురక్షితంగా వచ్చినందుకు ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీస్ వారికి సోషల్ మీడియా వేదికగా స్వాగతం పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మాధవన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ వంటి వారంతా వారికి స్వాగతం పలుకుతూ.. దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరారు.

Also Read- MS Dhoni – Sandeep Vanga: ‘యానిమల్’ దర్శకుడితో ఎమ్.ఎస్. ధోని.. సినిమా చూపించేశారుగా!

మెగాస్టార్ చిరంజీవి: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు స్వాగతం. ఇది ఒక చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి భూమికి రావాల్సిన మీరు.. 286 రోజుల తర్వాత పుడమికి చేరుకున్నారు. దాదాపు 4577 సార్లు మీరు భూమి చుట్టూ తిరిగారు. మీరు ఎంతో గొప్ప ధైర్యవంతులు. మీకెవరూ సాటిలేరు. మీ (సునీతా విలియమ్స్) ప్రయాణం ఒక అడ్వెంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు. మీ సాహసానికి హ్యాట్సాఫ్. నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ ఇది. మీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను. వారిని సురక్షితంగా భూమికి తీసుకువచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్, క్రూ9 టీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఆర్‌ మాధవన్‌: ఇలాంటి సైన్స్‌కి సంబంధించిన విషయాలలో ఎప్పుడు ముందుండే మాధవన్ ఎక్స్ వేదికగా.. ‘‘మా పూజలు ఫలించాయి. సునీతా విలియమ్స్ మీరు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. మీరు అలా నవ్వుతూ రావడం చూసి అద్భుతంగా అనిపించింది. 286 రోజుల తర్వాత అంతరిక్షం నుంచి మీరు పుడమికి రావడానికి లక్షలాది మంది ప్రార్థించారు. మిమ్మల్ని ఈ పుడమికి తీసుకువచ్చే ప్రక్రియలో శ్రమించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

పవన్ కళ్యాణ్: ‘‘అంతరిక్ష పరిశోధనలో ఇదొక చరిత్రాత్మక క్షణం. నాసాకు కృతజ్ఞతలు. భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌, అమెరికన్‌ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌లు సురక్షితంగా భూమికి చేరుకున్నందుకు హ్యాపీగా ఉంది. వీరిని తీసుకురావడంలో కీలపాత్ర పోషించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అద్భుతమైన విజయం. దీన్ని సాధ్యం చేసి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చారు’’

సాయి దుర్గా తేజ్: సునీతా విలియమ్స్‌‌‌గారూ పుడమికి స్వాగతం. 9 నెలల అంతరిక్షంలో అద్భుతమైన సాహసం చేసి.. మా అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారు. సునీతా విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్‌ సార్.. మీరు అంతరిక్ష పరిశోధనకు మీ అద్భుతమైన సహకారాన్ని అందించారు. మీ పట్టుదల, సహనానికి సెల్యూట్. స్పేస్ ఎక్స్‌కు కృతజ్ఞతలు.

Also Read- Sunita Williams: సునీతా విలియమ్స్ సేఫ్.. ఇదే లేకుంటే.. ఎప్పటికీ అక్కడే?

ఇలా సెలబ్రిటీలెందరో అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకున్న హ్యోమగాములకు స్వాగతం పలుకుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ హ్యోమగాములు 8 రోజుల యాత్ర నిమిత్తం జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. 286 రోజుల తర్వాత అడ్వంచర్ ట్విస్ట్‌లతో భూమికి చేరుకున్న వారు.. ఇప్పుడు అసలైన ఫైట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భూమికి చేరుకున్న ఆ హ్యోమగాములందరినీ హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. అక్కడ వారికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, భూమి గ్రావిటీకి, వెదర్‌కి వాళ్లని అలవాటు చేయనున్నారు. ఉదయం సునీతా విలియమ్స్‌ను చూసినప్పుడు.. ఆవిడ అసలు నిలబడలేకపోవడం గమనించవచ్చు. ఆమె కాలి పాదాలు మొత్తబడిపోయానని, తిరిగి ఆమె భూమిపై నిలబడేందుకు 45 రోజుల సమయం పట్టే అవకాశముందని అంటున్నారు. సో.. 8 రోజుల యాత్ర, 286 రోజులకు చేరినా, వాళ్లు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం అయితే ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..