తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ:TG 10th Exams: తెలంగాణలో ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. 2650 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వివరించారు. ఇందులో అబ్బాయిలు 2,58,895 మంది ఉండగా బాలికలు 2,50,508 మంది ఉన్నట్లు తెలిపారు.
Also Read: CM Revanth Reddy: బీజేపీ స్టేట్ చీఫ్.. ఎమ్మెల్యేలు.. మధ్యలో సీఎం రేవంత్.. అసలేం జరుగుతుంది?
ఈనెల 21న మొదలై ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఫస్ట్ లాంగ్వేజ్(కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు జరగనుందని పేర్కొన్నారు. అలాగే సైన్స్ సబ్జెక్టులకు గాను ఫిజికల్, బయోలజీ సైన్స్ పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
Also Read: Hyderabad Rental Scam: హైదరాబాద్ లో కోలివింగ్ పేరిట దోచుడే దోచుడు.. అమాయక యువతులే టార్గెట్?
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 11,547 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2650 కేంద్రాలకు 2650 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. అలాగే 2650 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను, 28100 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టంచేశారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్లు వివరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు