MS Dhoni – Sandeep Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఏమిటదని అనుకుంటున్నారా? ఎందుకనుకుంటారు? ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసేసే ఉంటారుగా. నిజంగా సందీప్‌కు ఇది అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు.
ఒక ఎలక్ట్రిక్ సైకిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న మిస్టర్ కూల్, తలా మహేంద్రసింగ్ ధోనిని ఈ ‘యానిమల్’ దర్శకుడు డైరెక్ట్ చేశారు. అవును.. ఇమోటోరాడ్ అనే ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఓ యాడ్‌ని ఎమ్ఎస్ ధోనితో పిక్చరైజ్ చేశారు సందీప్ రెడ్డి వంగా. ఆ యాడ్ కోసం ఆయన ఎంచుకున్న థీమ్ ఏంటో తెలుసా? ‘యానిమల్’ మూవీ థీమ్.
Also Read- Betting Apps: ఆధారాలు సేకరిస్తున్నాం, ఎవ్వరినీ వదిలి పెట్టం.. ఇన్‌ఫ్లూయెన్సర్ల గుండెల్లో వణుకు!
అసలీ యాడ్‌లో స్టార్టింగ్ అంతా ఎమ్.ఎస్. ధోని అని అనుకుని ఉండరు. రణ్‌బీర్ కపూర్ అనే అనుకున్నారు. కానీ, ధోని మేకోవర్ సేమ్ టు సేమ్ ‘యానిమల్’ హీరోని తలపించేలా చేసి, అదే సినిమాలో సీన్‌ని రీ క్రియేట్ చేసిన వంగా, చివరిలో సిగ్నేచర్ మూమెంట్‌తో అందరికీ షాకిచ్చారు. సినిమాలో ఒకానొక సందర్భంలో వచ్చే ఆ సిగ్నేచర్ మూమెంట్‌పై ఎంత రాద్దాంతం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయినా వంగా ధైర్యం ఏంటో అందరికీ తెలుసు. బాలీవుడ్‌లో మహామహుల్నే తన ఇంటర్వ్యూలలో నోరు మూయించాడు. అలాంటి దర్శకుడు.. ధోని వంటి స్టార్ క్రికెటర్‌ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఊరుకుంటాడా? రచ్చ రచ్చ చేసి పడేశాడు. ఎక్కడ చూసిన ఈ వీడియోనే, ఎవరిని కదిలించినా.. ఈ వీడియో గురించే చర్చ. అలా ఉంటది మరి వంగాతో.
Animal For A Reason 😉@e_motorad @msdhoni pic.twitter.com/4ZHEe4LOFr
— Sandeep Reddy Vanga (@imvangasandeep) March 18, 2025
ఇక ధోని కూడా, యాక్టింగ్‌లో ఇరగదీశాడు. వంగా చెప్పినట్లుగా విజిల్ వేయించేశాడని చెప్పుకోవచ్చు. అసలు ధోని అని ఎవరూ నమ్మని విధంగా తన యాక్టింగ్‌తో ఇరగ్గొట్టేశాడు. చూస్తుంటే, ధోని నెక్ట్స్ స్టెప్ యాక్టింగ్ వైపు అడుగు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. యాక్టింగ్‌లోకి దిగడం ఏమంత పెద్ద ఇష్యూనే కాదు.
ఇక సందీప్ రెడ్డికి వచ్చిన ఈ అవకాశాన్ని చూసి చాలా మంది డైరెక్టర్స్ అసూయ పడుతుంటారు. కారణం, ధోని అంటే వాళ్లకి అంత ఇష్టం. అలాంటి స్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. కానీ ఆ అవకాశం సందీప్ రెడ్డి వంగాకి దక్కడం నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అందుకే మిగతా దర్శకులు వంగా అదృష్టాన్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు.
మాములుగా సినిమాకు, క్రికెట్‌కు.. సినిమాకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందని చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా క్రికెటర్లు, హీరోయిన్లతో డేటింగ్ చేయడం, వారినే పెళ్లి చేసుకోవడం ఈ మధ్య రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ రెండింటిని వేరు చేసి చూడలేం. ఇప్పుడు క్రికెటర్ ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం ఒక సినిమా దర్శకుడైన సందీప్ వంగాకి రావడానికి గల కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. ఆ అవకాశాన్ని సందీప్ నూటికి వెయ్యి శాతం వినియోగించుకున్నాడు.
Also Read- Mad Square: మూడో పాటతో వచ్చార్రోయ్.. మాస్ మ్యాడ్‌నెస్ చూడండ్రోయ్!
ఒక్క సిగ్నేచర్ మూమెంట్ చాలు అన్నట్లుగా ఈ యాడ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారంటే.. సెలక్షన్ కుదరినట్టే. సందీప్‌కి హీరో దొరికినట్టే. ఈ పరిచయంతో నెక్ట్స్ సందీప్ సినిమాలో ధోని గెస్ట్ రోల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. నెక్ట్స్ వంగా సినిమా ప్రభాస్‌తోనే ఉండే అవకాశం ఉంది. సో.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌ని వంగా సెట్ చేస్తాడేమో చూద్దాం..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు