Mad Square: మూడో పాటతో వచ్చార్రోయ్.. మాస్ మ్యాడ్‌నెస్!
Mad Square Movie Still (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mad Square: మూడో పాటతో వచ్చార్రోయ్.. మాస్ మ్యాడ్‌నెస్ చూడండ్రోయ్!

Mad Square Third Song Released: ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడంతో పాటు.. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ముఖ్యంగా యూత్‌ని వెయిట్ చేసేలా చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు చార్ట్‌బస్టర్స్‌‌గా నిలిచి ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాట ‘వచ్చార్రోయ్’ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ‘మ్యాడ్’ గ్యాంగ్‌కు మరోసారి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న ఈ ‘వచ్చార్రోయ్’ పాట ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా.. వినగానే అంతా కాలు కదిలించి డ్యాన్స్ చేసేలా ఉంది. పాటను ఒక్కసారి గమనిస్తే..

Also Read- Star Heroine: బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. చర్యలు తీసుకుంటారా?

‘‘వచ్చార్రోయ్.. మళ్లీ వచ్చార్రోయ్..
వీళ్లకు హారతి పట్టండ్రో.. దార్లో బరాత్ కొట్టండ్రో
ధే ఆర్ బ్యాక్.. టు కమ్ అండ్ రాక్..
మల్లీప్లెక్స్‌లో కూడ, మాస్ మ్యాడ్‌నెస్ చూడండ్రో..
దేశం మొత్తం దోస్తానంతా డీజే పెట్టాల్రో..
వీల్ల చిల్లర లెక్కలు చూసి మీరు సిటీ కొట్టాల్రో..’’ అంటూ వచ్చిన ఈ పాటను సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, స్వయంగా ఆయనే ఆలపించారు. మరో విశేషం ఏమిటంటే ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు కె.వి. అనుదీప్ ఈ పాటకు అదిరిపోయేలా సాహిత్యం అందించడం.

భీమ్స్ సిసిరోలియో తనదైన శైలి సంగీతంతో కట్టిపడేయగా.. ఆయన గాత్రం ఈ పాటను చార్ట్ బస్టర్‌గా నిలిచేలా చేస్తుంది. అలాగే కె.వి. అనుదీప్ సాహిత్యం కూడా క్యాచీగా ఉంటూ, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. ‘ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్’ వంటి లైన్స్ యూత్‌కు కావాల్సినంత హుషారును ఇచ్చేలా ఉన్నాయి. అందుకే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే టాప్‌లో ట్రెండ్‌లోకి వచ్చేసింది. నెటిజన్లు ఈ పాటను తెగ వైరల్ చేస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలోనూ ‘మ్యాడ్’ తరహాలోనే హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనాన్ని దర్శకుడు కళ్యాణ్ జోడించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

Also Read- Aditya 369 Re-Release: డేట్ ఫిక్సయింది.. మళ్లీ హిస్టరీని క్రియేట్ చేస్తుందా?

ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, కె.వి. అనుదీప్ వంటివారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతుండగా.. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందని చెబుతున్న మేకర్స్ మాట.. ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే మాత్రం మార్చి 28 వరకు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..