Dragon OTT: ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవి ఓ స్టేజ్‌పై ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే టైటిల్‌ను తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (‘లవ్ టుడే’ ఫేమ్) ఆల్రెడీ వాడేశారు. ఆయన హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return Of the Dragon). ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
Also Read- Star Heroine: బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. చర్యలు తీసుకుంటారా?
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కయాదు లోహర్ ఒక్కసారిగా కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది. ఇంతకు ముందు శ్రీవిష్ణు సరసన ఓ సినిమా చేసినా, కయాదు లోహర్‌కు అంత పేరు రాలేదు. అసలు ఆమె తెలుగు సినిమా చేసిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో ఆమె పంట పండింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు, వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతేనా, స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకు పిలుపు వస్తున్నట్లుగా కూడా ఈ మధ్య వార్తలు వైరల్ అవుతూ.. పాపని ట్రెండ్‌లో ఉంచుతున్నాయి.
అసలీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని చిత్ర టీమ్ కూడా ఊహించి ఉండదు. అందుకే చెప్పేది.. కంటెంట్‌ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ భంగపడినట్లు చరిత్రలోనే లేదు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో ఆ కంటెంట్‌కు గుర్తింపు దక్కుతుంది. తమిళ్‌లో ఎలా అయితే ఆదరణ లభించిందో.. తెలుగులోనూ ఈ సినిమాకు అంతకంటే ఎక్కువగా ఆదరణ లభించడంతో చిత్రయూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ, స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..
Some dragons don’t breathe fire, because their comebacks are hotter 😎🧯
Watch Dragon on Netflix, out 21 March in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam #DragonOnNetflix pic.twitter.com/hFGn9tRTia— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఓటీటీ రిలీజ్‌పై కొన్ని రోజులుగా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించింది. మార్చి 21 (Return of the Dragon OTT Streaming Date) నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ న్యూస్‌తో కుర్రవాళ్లు యమా హ్యాపీగా ఉన్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించింది. యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా వారికి బాగా కనెక్ట్ అయింది. అంతే, బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమాకు అలాంటి ఆదరణే వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read- O Andala Rakshasi: ‘ఉప్పెన’ను తలపించే మోహినీ వశీకరణం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్!
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా కథ విషయానికి వస్తే.. అప్పటి వరకు అన్నింట్లో టాపర్‌గా ఉన్న రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్), ఇంజనీరింగ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత పూర్తిగా మారిపోతాడు. అమ్మాయిలు, ప్రేమలు అంటూ స్టడీని పక్కన పెట్టేస్తాడు. బీటెక్ తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో లవర్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) కూడా అతడిని వదిలేస్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్స్ నమ్ముకున్న రాఘవన్.. ఎలాగోలా ఒక మంచి ఉద్యోగం సాధిస్తాడు. ఆ తర్వాత ధనవంతుడిగా మారిపోతాడు. పల్లవి (కయాదు లోహర్) అనే ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన సమయంలో ఓ ట్విస్ట్ నెలకొంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి? అది ఎంత వరకు దారి తీసింది? పల్లవితో రాఘవన్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు