O Andala Rakshasi Trailer: షెరాజ్ మెహదీ తన మల్టీ టాలెంట్‌తో.. దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాకు ఆయనే హీరో, దర్శకుడు. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మిస్తున్నారు. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని షెరాజ్ మెహదీ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 21న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- Tuk Tuk: ‘కోర్టు’ సక్సెస్ ‘టుక్ టుక్’పై ప్రభావం చూపుతుందట.. అదెలా?
కొన్ని ఇంటిమేట్ సీన్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. అమ్మాయిలు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా చూపించారు. వారు అలా చేసుకోవడానికి కారణం ఏమిటనేది కూడా ఆ వెంటనే రివీల్ చేశారు. ‘పెళ్లి చేసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు కదా.. ఎందుకు ట్రిప్‌కో ఫ్లవర్‌ని నలిపేయడం’ అనే డైలాగ్‌తో ఇందులో హీరో పాత్ర స్వభావాన్ని తెలియజేశారు. అందరినీ ఎమోషన్ బ్లాక్‌మెయిల్ చేసి చంపేస్తుంది ఒక్కరే ఎందుకు కాకూడదు అంటూ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న లేవనెత్తించిన అనంతరం.. ఈ ట్రైలర్ రూపమే మారిపోయింది.
షెరాజ్ మెహదీ (Sheraz Mehdi) పాత్రలోని వెరియేషన్స్‌ని, అతని మెంటాలిటినీ తెలియజేసిన అనంతరం.. అసలు కాన్సెప్ట్‌ని రివీల్ చేశారు. ‘నీ జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆమె వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోతుందిరా’ అనే డైలాగ్‌తో స్టోరీ లైన్‌ని చెప్పేశారు. ఆ వెంటనే ఒక అమ్మాయి ఎంట్రీ, ఆ అమ్మాయితో షెరాజ్ మెహదీ ప్రేమ, పెళ్లి వంటివి చూపించారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఆమెను వదిలించుకున్నట్లుగా చూపించారు. అంతే, హర్రర్ అంశాలతో అక్కడి నుంచి ట్రైలర్ ఫుల్ ఎంగేజ్ చేసింది. మరీ ముఖ్యంగా చివరిలో ‘ఉప్పెన’ సీన్‌తో తలపించే ఎపిసోడ్.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఆడపిల్లల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడేవారికి ఇదే శిక్ష అన్నట్లుగా హర్రర్ కాన్సెప్ట్‌తో చెప్పిన తీరు.. కచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుందనడంలో అతిశయోక్తి లేనే లేదు.
ప్రస్తుతం ఇలాంటి సినిమాలు అవసరం కూడా. పాశ్చాత్య పోకడ ఎక్కువై, గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ నేటి యువత ఎలా నాశనం అయిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి భయానక సన్నివేశాలు ఉంటేనే, కాస్తయినా మార్పుని ఊహించవచ్చు అనే ఫీల్‌ని ఇవ్వడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇందులో నటించిన నటీనటులు కూడా వారి వారి పాత్రలకు కనెక్ట్ అయ్యేలా నటించారు. కెమెరా, మ్యూజిక్ హైలెట్ అనేలా అన్నాయి.
Also Read- Manchu Lakshmi: సజ్జనార్‌గారూ.. మంచు అక్కని ఎలా వదిలేశారు?
ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్న ఈ ట్రైలర్‌లో.. చివరి షాట్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. భాష్య శ్రీ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి వారు ఇందులో కీలక పాత్రలలో నటించడం విశేషం. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు