Nidhhi Agerwal (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Star Heroine: బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. చర్యలు తీసుకుంటారా?

Star Heroine: స్టార్ హీరోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas)లతో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికేసింది. ఆమె ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో.. ఆ వీడియోను పోస్ట్ చేసి.. ఈ హీరోయిన్ కూడా బెట్టింగ్ యాప్‌ని ప్రచారం చేస్తుంది.. చర్యలు తీసుకుంటారా? సార్ అంటూ నెటిజన్లు కొందరు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్న హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు..?

Also Read- O Andala Rakshasi: ‘ఉప్పెన’ను తలపించే మోహినీ వశీకరణం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu), రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ ‘నిధి అగర్వాల్’ (Nidhhi Agerwal). అవును.. నిధి కూడా ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసే జాబితాలో చేరిపోయింది. మరి ఆమె ఎప్పుడు ఈ యాప్‌ని ప్రమోట్ చేసిందో తెలియదు కానీ, వీడియో మాత్రం వైరల్ అవుతుంది. ఆమె నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్ తర్వాత.. సరైన సినిమానే లేని ఈ భామకు, ఇలాంటి అవకాశం రావడంతో కాదనలేకపోయి ఉంటుంది. వెంటనే ఓకే చేసేసి.. ప్రమోషన్ చేసింది. ఇప్పుడదే ఆమె మెడకు చుట్టుకుంది.

ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలపై, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ వంటి వారు ఈ విషయంలో పెద్ద యుద్ధమే మొదలు పెట్టారు. ‘మీ ప్రాంతంలో ఎవరైనా బెట్టింగ్ యాప్స్‌ని ప్రచారం చేస్తూ కనిపిస్తే, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి అక్రమ ప్రచారం అనేకమందిని సంక్షోభానికి గురిచేస్తుందని.. ఇది ఆపాల్సిన అవసరం ఉంది’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తున్నారు.

ఆయన పిలుపుతో నెటిజన్లు కొందరు డ్యూటీ ఎక్కేశారు. ఎవరెవరు ఇప్పుడు, ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారనే సమాచారాన్ని సేకరిస్తూ.. ఆ వివరాలతో సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు బయటికి వచ్చిన వివరాల ప్రకారం మంచు లక్ష్మీ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్.. ఇప్పడు కొత్తగా నిధి అగర్వాల్ లిస్ట్‌లోకి చేరారు. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. అంతకు ముందు, ఇలా బెట్టింగ్ యాప్స్‌ని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్స్, జబర్దస్త్ టీమ్‌కు చెందిన దాదాపు 11 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Also Read- Tuk Tuk: ‘కోర్టు’ సక్సెస్ ‘టుక్ టుక్’పై ప్రభావం చూపుతుందట.. అదెలా?

అందులో ఇమ్రాన్​ ఖాన్​, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్​ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేశయని సుప్రిత, కిరణ్​ గౌడ్​, అజయ్​, సన్నీ, సుధీర్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. ‘సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నాం. ఏ ఏ వీడియోలు పెట్టారు అన్నది చూస్తాం. ఈ కేసులో ఆధారాల సేక‌ర‌ణ త‌ర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11మందిపై కేసు నమోదు చేశాం’ అని బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ ఎస్ఎం విజ‌య్ కుమార్ వివరణ ఇచ్చారు. దీంతో, ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీల పేర్లు కూడా బయటికి రావడంతో వారిపై కూడా కేసు నమోదు చేస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు