Manchu Lakshmi and Sajjanar (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Manchu Lakshmi: సజ్జనార్‌గారూ.. మంచు అక్కని ఎలా వదిలేశారు?

Manchu Lakshmi: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిని కలుపు మొక్కలు ఏరేసినట్టుగా ఏరేస్తూ.. టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి మహా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీస్తున్న బెట్టింగ్ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు భీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. ఎక్కడ ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారని తెలిసినా, వెంటనే వారిపై కేసు నమోదు చేస్తూ.. ప్రక్షాళన మొదలెట్టారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏం వీడియో అది అని అనుకుంటున్నారా? మంచు అక్క, అదేనండీ.. మంచు లక్ష్మీ ప్రసన్న కూడా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వీడియో అది. ఈ వీడియోని షేర్ చేస్తున్న వారంతా కూడా సజ్జనార్‌ (Sajjannar)కు ట్యాగ్ చేస్తున్నారు. ‘సజ్జనార్‌గారూ.. మరి మంచు అక్కపై కూడా కేసు నమోదు చేస్తారా? చూస్తున్నారుగా ఈ వీడియోలో.. ఎలా ఆమె ప్రమోట్ చేస్తుందో? అసలు అలా ఎలా వదిలేశారు మా మంచు అక్కని?’ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

Also Read- Mohan Babu: ‘కన్నప్ప’ మూడో పాట.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతం ఎప్పుడంటే?

నెటిజన్లు చేస్తున్న ఈ పోస్ట్‌లతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి సజ్జనార్ రియాక్షన్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. సామాన్యులపైనే కేసు నమోదు చేస్తారా? ఇలాంటి సెలబ్రిటీలను ఏం చేయరా? అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే, మంచు లక్ష్మీ గట్టిగానే బుక్కయ్యేలా ఉంది. ఎందుకంటే, ఇప్పటికే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్స్‌‌పై పోలీసు వారు కేసులు నమోదు చేశారు. దాదాపు 11 మందిపై కేసు నమోదు అయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ అంశం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇక ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ (Betting Apps) విషయంలో కేసు నమోదైన వారి విషయానికి వస్తే.. అందులో యాంకర్ శ్యామల, విష్ణు ప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రిత, హర్ష సాయి వంటి వారుండటం విశేషం. వీరిలో కొందరు ఇకపై బెట్టింగ్ యాప్స్ జోలికి పోమని, క్షమించాలని వీడియోలు చేసిన వారు కూడా ఉన్నారు. అయినా కూడా పోలీసులు వీరిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. ఏదయితేనేం, మార్పు అయితే మొదలైంది. సజ్జనార్ వంటి ప్రముఖులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవడం అనేది ఇక్కడ అభినందించాల్సిన విషయం.

Also Read- 12A Railway Colony: అల్లరి నరేష్ సినిమా.. స్పైన్ చిల్లింగ్ టీజర్‌తో టైటిల్ రివీల్

ఆయన గట్టిగా పోరాటం చేస్తున్నారు కాబట్టే.. ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఆయన పిలుపు మేరకు సెలబ్రిటీలు కొందరు స్వచ్ఛందంగా ఈ బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన కల్పిస్తూ వీడియోలు చేస్తుండటం కూడా మంచి పరిణామంగా పేర్కొనవచ్చు. ఒక మహమ్మారిని ఎదుర్కొవాలంటే మాత్రం ఒక బలమైన వ్యక్తి ముందుండి పోరాటం జరపాలనేది ఈ విషయంతో అర్థమవుతుంది అంటూ.. ప్రతి ఒక్కరూ సజ్జనార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మన మంచు అక్క సంగతి ఏంటో.. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు