Rajiv Yuva Vikasam Scheme: మీకు స్వయం ఉపాధిలో రాణించే సత్తా ఉందా? ఒకరి మీద ఆధారపడకుండా మీ జీవితాన్ని మీరే సాగించాలని అనుకుంటున్నారా? ఆధారపడి పని చేస్తున్న మీరు.. స్వయంగా ఉపాధి పొంది, పదిమందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసమే తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు దగ్గరికి చేసేందుకు ఆర్థిక సాయాన్ని అందించనుంది ప్రభుత్వం. మరెందుకు ఆలస్యం.. ఆ స్కీమ్ గురించి అసలు విషయం తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని, 5 లక్షల మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు సీఎం తెలిపారు.
ఆలస్యం వద్దు.. ఇప్పుడే అప్లై చేయండి
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న నిరుద్యోగులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నేటి నుండి ఏప్రిల్ 5వ తేదీలోగా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మండల కార్యాలయాలలో, ప్రజాపాలన సేవ కేంద్రాల ద్వారా సైతం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ఈ పథకం వర్తించనుంది. లబ్ధిదారుల ఎంపిక ఏప్రిల్ 6 వ తేదీ నుండి మే 30 వ తేదీ వరకు నిర్వహిస్తామని, మంజూరు పత్రాల ప్రదాన కార్యక్రమం జూన్ 2 వ తేదీన జరగనుంది.
Also Read: CM Revanth Reddy: నేటి రాజకీయాలపై.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..
డ్రైవింగ్ లైసెన్స్ , ఐటిఐ పట్టా పొందిన వారికి, ఎలక్ట్రికల్ వాహనాలు నడిపే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఉపాధి అవకాశాన్ని కల్పించడం ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఆర్థిక భరోసా అందించే అవకాశం ఉంది. మరెందుకు ఆలస్యం.. ఆన్లైన్ లో అప్లై చేయండి.. పథకం ద్వారా లబ్ది పొందండి.