Karimnagar News (image credit;ai)
తెలంగాణ

Karimnagar News: పిట్ట అరుపుకు ఉలిక్కి పడుతున్న గ్రామం.. ఇళ్లకు తాళాలు వేసి మరీ..

Karimnagar News: ఆ గ్రామంలో పిట్ట అరుపుకు భయపడుతున్నారు గ్రామస్తులు. పిట్ట ఏంటి? భయమేంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 14 మంది మృతి చెందారు. కేవలం 40 రోజుల్లో 14 మంది మృతి చెందడంతో గ్రామ ప్రజలకు భయం పట్టుకుంది. తమ గ్రామానికి కీడు సోకిందని భావించి అందుకు నివారణ చర్యలు చేపట్టారు గ్రామస్తులు. వారేమి చేశారు? ఆ గ్రామమేది అనే విషయాలు తెలుసుకుందాం.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా మరణాలు పెరిగిపోతున్నాయి. 40 రోజుల్లో 14 మంది చనిపోయారు. చిన్నపాటి గ్రామం లో ఇంత మంది చనిపోవడం తో.. ఏదో జరిగిందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన వారి దశదినకర్మలు పూర్తికాకుండానే మరొకరు మృతి చెందుతున్నారు. గ్రామానికి ఏదో కీడు జరిగిందని భయపడిపోతున్న పరిస్థితి. అందుకు గ్రామస్తులంతా రచ్చబండ వద్ద ఓ నిర్ణయం తీసుకున్నారు.

కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి కీడు వంటలు వండు కోవాలని పెద్ద మనుషులు నిర్ణయించారు. దీనితో గ్రామస్తులు.. ఒక్కరోజు గ్రామం వదిలి పెట్టి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది అందరూ ఉదయం 6 గంటలకు..ఇంటికి తాళం వేసి.. పొలం బాట పట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి మానేరు పరివాహక ప్రాంతంలో కీడు వంటలకు వెళ్లారు.

ఉదయం 6 గంటల నుండి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని తిన్నారు. సాయంత్రం వరకు ఎవరూ కూడా మళ్ళీ గ్రామం లోకి వెళ్ళవద్దని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం.. పొలాల వద్దనే గడిపారు. కీడు సోకడం వల్ల చాలా మంది ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు పోవాలంటే గ్రామాన్ని విడిచి కీడు వంటలు చేసినట్లయితే ఆ కీడు పోతుందని తెలియడంతో గ్రామాన్ని వదిలి వచ్చామని స్థానికులు చెబుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. 40 రోజుల క్రితం 2 పెద్ద పిట్టలు.. చెట్టు పై అరిచాయి. అవి అరిచిన తరువాత ఒక వ్యక్తి చనిపోయారు. ఈ పెద్ద పిట్ట రావడంతో మరణాలు జరిగినట్లు గ్రామస్తులు నమ్మడం విశేషం. 3 రోజుల క్రితం మరో వ్యక్తి చనిపోయారు. దీంతో గ్రామస్తులు మరింత భయపడుతున్నారు.

విలాసాగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ మూడు రోజుల క్రితం అనారోగ్యం తో చనిపోయారు. ఒక్క రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై తనువు చాలించారు. అదే విధంగా నల్లి పుష్ప.. జ్వరంతో బాధ పడి మంచం పట్టింది. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రశాంత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. రాజ్యలక్ష్మి అనే మహిళ కూడా అనారోగ్యంతో తనువు చాలించారు. ఈ 40 రోజుల్లో.. ఇలా అనారోగ్యం తో చనిపోవడంతో ఏమో జరిగిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం లో ఒకరు.. ఇద్దరు చనిపోవడం తో.. భయంభయంగా ఉందని గ్రామస్తులు తెలపడం విశేషం.

Also Read: CM Revanth Reddy: నేటి రాజకీయాలపై.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

అయితే ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మవద్దని హేతువాదులు చెబుతున్నారు. ఇవన్నీ సహజ మరణాలే అని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. గ్రామం లోని ప్రజలకు ప్రభుత్వం మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించి.. వారికి వాస్తవాలు వివరించాలని పలువురు కోరుతున్నారు. ఏది ఏమైనా గ్రామస్తులు అందరూ పిట్ట శబ్దానికి భయపడడం, అలాగే కీడు వంటల కోసం తెల్లవారుజామునే ఊరు విడిచి వెళ్లడంతో, విలాసాగర్ గ్రామమంతా తాళాలు వేసి ఉండి నిర్మానుష్యంగా మారింది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?