Salaar Sculptures (Image Source: Hombale Films X Account)
ఎంటర్‌టైన్మెంట్

Salaar Sculptures: ప్రభాస్ ‘సలార్’ శిల్పాలు వచ్చేశాయ్.. ఒక్కో శిల్పం ఖరీదు ఎంతంటే?

Salaar Sculptures: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌డమ్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) సొంతం చేసుకున్నారు. నెంబర్స్‌తో కొలవలేని స్టార్‌డమ్ ప్రభాస్‌ది. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ పటానికి పరిచయం చేసిన హీరోగా ప్రభాస్ హిస్టరీని క్రియేట్ చేశారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ను చూసే కోణమే మారిపోయింది. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ సినిమాను శాసించిన ఈ రెబల్ స్టార్.. ఆ తర్వాత చేసే ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తుండటం విశేషం.

ప్రభాస్ అంటే ముందు గుర్తొచ్చేది భారీ కటౌట్. ఆ కటౌట్‌‌ని చూసి కొన్ని కొన్ని కాదు.. అన్ని నమ్మేయాల్సిందే. అదే చేస్తున్నారు, ఆయనతో ‘సలార్’ సినిమా చేసిన హోంబలే ఫిలింస్ బ్యానర్ మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిలింస్ నిర్మించిన చిత్రం ‘సలార్’. రెండు పార్ట్‌లుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, ఇప్పటికే ఒక పార్ట్ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ‘సీజ్ ఫైర్’గా వచ్చిన ఈ పార్ట్.. నిజంగానే కలెక్షన్ల విషయంలో ఫైర్ చూపించింది. ఇప్పుడు ‘సలార్: శౌర్యాంగ పర్వం’ కోసం అంతా వేచి చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

Also Read- Sapthagiri: నిజం.. సినిమా వాళ్లకు పిల్లని ఇవ్వరు.. ఇదేంటో నాకర్థం కావడం లేదు!

ప్రస్తుతం ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ‘సలార్’ రెండో భాగం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోపు ‘సలార్’ని వార్తల్లో ఉంచేందుకు నిర్మాతలు భారీగానే ప్లాన్ చేశారు. ‘సలార్’లోని ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని శిల్పాలుగా చేసి, హోంబలేవర్స్ వెబ్‌సైట్‌లో సేల్‌కి పెట్టారు. ఈ శిల్పాల ఖరీదు తెలిస్తే అంతా అవాక్కవుతారు. ఇవేదో టాయ్స్ అని అనుకుంటారేమో? టాయ్స్ కాదు.. శిల్పాలు. ప్రభాస్ వీరోచిత అవతార్‌లో ఉన్న శిల్పాలు. వీటి ధర ఎంతంటే..

ప్రస్తుతం హోంబలేవర్స్ వెబ్‌సైట్‌లో మూడు శిల్పాలను ఉంచారు. వాటిలో ఒకటి ‘అన్‌స్టాపబుల్ ప్రభాస్’ పేరుతో ఉంది. దీని ఖరీదు అక్షరాలా రూ. 4299. మరో రెంబు శిల్సాలు ‘సలార్ ఇన్ యాక్షన్’, ఫీర్స్ సలార్’ పేరుతో ఉంచారు. వాటి ధర రూ. 2999కి ఫిక్స్ చేశారు. అందుకే అంది ప్రభాస్ కటౌట్‌ని చూసి అన్నీ నమ్మేయాల్సిందే అని. ఆ రేట్స్ చూస్తుంటే.. ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. ఒక కన్నడ నిర్మాత, ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఇలా శిల్పాలు చేయించడం, వాటి కోసం ఒక వెబ్ సైట్ పెట్టి మరీ ‘సలార్‌వర్స్’ అంటూ అమ్మకానికి పెట్టడం అంటే మాములు విషయం అయితే కానే కాదు. ప్రభాస్ క్రేజ్, రేంజ్ ఇదని తెలిపే ప్రక్రియగా ఫ్యాన్స్ దీనిని వర్ణిస్తున్నారు. మరోవైపు ఆ శిల్పాలను చూస్తుంటే.. ఆ రేట్స్ కూడా వర్త్ వర్మ వర్త్ అనేలా ఉన్నాయంటే.. హోంబలే ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ పెట్టేయండి.. అభిమాన హీరో శిల్పాన్ని తెచ్చేసుకోండి.

Also Read- Arjun Son Of Vyjayanthi: వైజాగ్‌ను శాసించేది పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. కళ్యాణ్ రామ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే?

‘సలార్’ విషయానికి వస్తే.. ఇందులో దేవ అనే పాత్రలో ప్రభాస్ నటించారు. స్నేహితుడు వరదా కోసం ఎంతకైనా తెగించే పాత్రలో ప్రభాస్ అరిపించేశాడు. డైలాగ్స్ తక్కువే ఉన్నా.. యాక్షన్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉంటుందీ సినిమాలో. ప్రభాస్ స్నేహితుడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ ఎప్పుడెప్పుడు రెండో పార్ట్ వస్తుందా? అని వెయిట్ చేయించేలా చేస్తుందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ