Sapthagiri Pelli Kaani Prasad Movie Still (Image source: Twitter X)
ఎంటర్‌టైన్మెంట్

Sapthagiri: నిజం.. సినిమా వాళ్లకు పిల్లని ఇవ్వరు.. ఇదేంటో నాకర్థం కావడం లేదు!

Sapthagiri: సినిమా వాళ్లకు పిల్లని ఇవ్వడం లేదని అన్నారు కమెడియన్ కమ్ హీరో సప్తగిరి. థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్న సినిమా ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kaani Prasad). అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది.

చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా సమావేశాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరికి ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Arjun Son Of Vyjayanthi: వైజాగ్‌ను శాసించేది పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. కళ్యాణ్ రామ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే?

‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?’ అని మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు.. ‘చూడన్నా పిల్లని.. నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నాను’ అని సప్తగిరి అన్నారు. ‘సినిమా వాళ్లకు పిల్లని ఇవ్వరు.. ప్రామిస్. ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకు ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా, సినిమా వాడా? అనే అంటారు. అదేంటో నాకు అర్థం కావడం లేదు. నేను సినిమా వాడిని కావడమే ఇబ్బంది అయిపోయింది. అలా అని నాపై జాలి పడకండి. నేను హ్యాపీగానే ఉన్నాను..’ అని సప్తగిరి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ..

ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు పైగా అయిపోయింది. కమెడియన్‌గా 7, 8 సంవత్సరాలు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా 7, 8 సంవత్సరాలు అయిపోయాయ్. చాలా లాంగ్ జర్నీ చూశాం. కాబట్టి, చిన్న గ్యాప్ తీసుకుని.. మనల్నిమనం రీ బూట్ చేసుకుని, మంచి ఆలోచనతో వచ్చాం. ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏదైనా సరే.. వాటన్నింటికీ ఈ ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా సమాధానం అవుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని టెన్షన్ పడుతున్నాను. ఇంతకు ముందు నేను చేసిన ఓ సినిమా, ఎడిటింగ్ రూమ్‌లో చూసుకుని, ఇక అయిపోయిందని అనుకున్నాను. దాన్ని ఎంత పుష్ చేసినా కష్టమే అని తెలిసిపోయింది. కానీ, ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే టెన్షన్ పడుతున్నాను. నేను రాసిన ఎగ్జామ్‌కు మంచి మార్కులు పడతాయా? లేదా? అనే టెన్షన్.. అంతే.

Also Read- Brahma Anandam OTT: ఓటీటీలో విడుదలకు ఒక రోజు ముందే చూడొచ్చు.. ‘ఆహా’ అదిరిపోయే ఆఫర్!

ఒక కమెడియన్‌ని నవ్వించడం అంత ఈజీ కాదు. నా దగ్గరకు దర్శకుడు కథ తీసుకుని వచ్చినప్పుడే.. ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేసుకుని, డైలాగ్ వెర్షన్‌తో సహా రెడీ చేసుకుని వచ్చాడు. డైలాగ్స్ చాలా ఫ్రెష్‌గా అనిపించాయి. సెకండాఫ్‌లో రెండు చోట్ల ఎమోషనల్ సీన్స్ రాసుకునే అవకాశం ఉంది. కానీ దర్శకుడు అక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఎడిటింగ్ రూమ్‌లో చూసిన తర్వాత తన నిర్ణయం కరెక్ట్ అనిపించింది.. అని సప్తగిరి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!