Arjun Son Of Vyjayanthi Teaser: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), రాములమ్మ విజయశాంతి (Vijayashanti) తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. విజయశాంతి ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నట్లుగా తాజాగా వచ్చిన టీజర్ తెలియజేస్తుంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో కళ్యాణ్ రామ్, ఆయన మదర్ రోల్ చేసిన విజయశాంతి లుక్స్, ప్రీ టీజర్ సినిమాపై స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయగా.. తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తుంది. టీజర్ విషయానికి వస్తే.. (Arjun Son Of Vyjayanthi Teaser Review)
Also Read- Brahma Anandam OTT: ఓటీటీలో విడుదలకు ఒక రోజు ముందే చూడొచ్చు.. ‘ఆహా’ అదిరిపోయే ఆఫర్!
‘‘10 సంవత్సరాల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్. కానీ, చావుకు ఎదురెళుతున్న ప్రతిసారి, నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్’’. అని రాములమ్మ వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. సినిమా పేరు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అని ఉంటే.. సినిమాలో మాత్రం ‘అర్జున్ సన్నాఫ్ విశ్వనాధ్’ అని ఉంది. ‘నెక్ట్స్ బర్త్‌డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే..’ అని కళ్యాణ్ రామ్‌కు రాములమ్మ ఇస్తున్న పోలీస్ డ్రస్‌పై ఆ పేరును రివీల్ చేస్తూ.. ఈ పేరు మీదే సినిమా మెయిన్ పాయింట్ ఉంటుందని తెలియజేశారు.
రాములమ్మ చెప్పిన ఆ డైలాగ్ అనంతరం ఒక్కసారిగా టీజర్‌లో సీరియస్‌నెస్, తెర కనిపించనంతగా విలన్లను చూపించారు. పృథ్వీ పోలీస్ వ్యవస్థపై చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్ అనంతరం.. ఊచకోత మొదలవుతుంది. ‘రేపటి నుంచి వైజాగ్‌ని పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాధ్ కనుసైగ శాసిస్తుంది’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా యాక్షన్ ప్రియులకు పండగే అనే ఫీల్ ఇస్తే.. ఆ వెంటనే, ‘నేను డ్యూటీలో ఉన్నా, లేకున్నా.. చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా.. నా కళ్ల ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ రాములమ్మలోని మరో కోణాన్ని ప్రజంట్ చేశారు.
ఓవరాల్‌గా అయితే స్టోరీ లైన్ ఇదని చెప్పడానికి వీలు లేకుండా, సినిమా కోసం వేచి చూసేలా టీజర్‌ని యాక్షన్, డైలాగ్స్, సెంటిమెంట్ సీన్లతో కట్ చేసి ఆసక్తిని రేకెత్తించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కచ్చితంగా ఓ మంచి పాయింట్‌తో అయితే వస్తుందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read- Ram Charan: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో.. ఆ శ్వాగ్‌కి ఫిదా కావాల్సిందే!
ఈ యాక్షన్ రోలర్ కోస్టర్‌కు అజనీస్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు. ఈ సమ్మర్‌లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రానుందని టీజర్‌లో మేకర్స్ తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు