Pushpa 3 Update (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Pushpa 3: ‘పుష్ప 3’ విడుదల ఎప్పుడంటే.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త!

Pushpa 3: ‘పుష్ప 2’ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ‘పుష్ప 3’ ఎప్పుడు ఉంటుందనేది అటు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) కానీ.. ఇటు సంచలన దర్శకుడు సుకుమార్ (Sukumar) కానీ చెప్పలేదు. మరి ఇదేంటి? ‘పుష్ప 3’ అంటున్నారు. విడుదల, పూనకాలు అంటున్నారని అంతా ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ‘పుష్ప 3’ సినిమా కూడా ఉంటుంది. ఈ విషయం స్వయంగా చిత్ర నిర్మాతే తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లో ‘పుష్ప’ సిరీస్ చిత్రాలు నిర్మితమైన విషయం తెలిసిందే. ఇప్పుడా బ్యానర్ నిర్మాతే, ‘పుష్ప 3’ విడుదల ఎప్పుడు ఉంటుందో చెప్పారంటే.. ఇంకా ఆశ్చర్యం, అనుమానాలు ఎందుకు? అసలు విషయం ఏమిటంటే..

Also Read- Vishwaksen: హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ.. 20 నిమిషాల వ్యవధిలోనే అంతా..!

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood). నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించగా ‘భీష్మ’ ఫేమ్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రస్తుతం ఏపీలో టూర్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలోని దుర్గమ్మ అమ్మవారిని నేడు (ఆదివారం) చిత్ర టీమ్ దర్శించుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవికి.. ‘పుష్ప 3’ ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘పుష్ప3’ చిత్రం కచ్చితంగా 2028లో విడుదలవుతుంది. అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే అప్డేట్ ఇస్తామని వెల్లడించారు. అది మ్యాటర్. ఇక అంతే.. ఫ్యాన్స్ ‘పుష్ప 3’ని ట్రెండ్‌లోకి తీసుకొచ్చేశారు. ఇన్నర్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏమిటంటే, ‘పుష్ప 3’కి సంబంధించి కొంతమేర షూట్ చేసిన ‘రా’ కంటెంట్ ఆల్రెడీ ఉందట. అంతేకాదు, ‘పుష్ప 3’ కోసం ఓ పాటను కూడా చిత్రీకరించారని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ కమిట్ అయిన చిత్రాలు, అలాగే సుకుమార్, రామ్ చరణ్‌ (Ram Charan) ల చిత్రం పూర్తయిన తర్వాత ‘పుష్ప 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందనేలా టాక్ నడుస్తుంది.

Also Read- AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌కు ఏమైంది? అస్వస్థతకు కారణం అదేనా?

ప్రస్తుతం అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా గురించి కూడా మైత్రీ రవి (Mythri Ravi) మాట్లాడారు. అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి చిత్రం చేయబోతున్నారని ఆయన మీడియాకు తెలిపారు. దీంతో చాలా వరకు డౌట్‌లో ఉన్న అంశాలకు నిర్మాత రవి క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇక ‘పుష్ప 3’ ఉంటుందని కచ్చితంగా నిర్మాతలే తెలుపుతున్నారు కాబట్టి.. ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఇక ఎవరితరం కాదనే చెప్పుకోవచ్చు. మరోవైపు, ‘పుష్ప’ వంటి చిత్రాలకు ఎలా అనుమతులు ఇస్తున్నారంటూ, టీచర్స్ కొందరు డైరెక్ట్‌గానే విమర్శలు చేస్తున్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే.. అసలు ఆ ‘పుష్ప’ సిరీస్ చిత్రాలు చేస్తుందే ఓ లెక్కల మాస్టారు అని. అది విషయం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు