AR Rahman: ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఆదివారం ఉదయం తీవ్ర ఛాతి నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఏఆర్ రెహమాన్‌కు ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతకు ముందు అసలు ఆయనకు ఏమైందో, ఏంటో అంటూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్న వారంతా, ఆస్పత్రి వర్గాలు చెప్పిన విషయంతో కాస్త కుదుటపడ్డారు. అయితే అసలు ఏఆర్ రెహమాన్‌కు ఛాతి నొప్పి రావడానికి కారణం ఏంటి? సంగీత ప్రపంచంలో ఎప్పుడూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే రెహమాన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Also Read- Vishnu Manchu: ‘కన్నప్ప’ స్వగ్రామంలో విష్ణు మంచు.. మ్యాటర్ ఏంటంటే?
అస్వస్థతకు అదే కారణమా?
ఇటీవల ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా భాను నుంచి విడిపోతున్నట్లుగా, విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, దీనిపై ఏది పడితే అది రాసి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దంటూ సీరియస్‌గా రెహమాన్ హెచ్చరించారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది పక్కన పెడితే.. ఆ ప్రకటన చేసినప్పటి నుంచి, రెహమాన్ తీవ్ర ఆందోళన, ఒత్తిడిలో ఉన్నాడనేలా ఆయన సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఎందుకంటే, వారి బంధం ఇప్పటిది కాదు. అంత గొప్ప లైఫ్‌ని లీడ్ చేసి, సడెన్‌గా విడిపోవడం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. వారి మధ్య ఆ అంతులేని దూరానికి కారణం ఏమిటనేది, ఇప్పటి వరకు అయితే తెలియరాలేదు.
మరోవైపు, వారిద్దరూ డెసిషన్ మార్చుకున్నారనేలా కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. విడాకుల ప్రకటన అనంతరం కొన్ని రోజులకు సైరా భాను హెల్త్ ఇష్యూస్‌తో ఆస్పత్రి పాలైతే, అంతా రెహమానే దగ్గరుండి చూసుకున్నారని, దీంతో మళ్లీ వారిద్దరూ ఒకటయ్యే అవకాశం ఉందనేలా సైరా భాను తరపు లాయర్ కూడా పబ్లిగ్గా చెప్పి ఉన్నారు. లాయర్ ప్రకటనతో రెహమాన్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆ ప్రకటన తర్వాత వారిపై వార్తలు రావడమే మానేశాయి. మొత్తంగా చూస్తే మాత్రం వైవాహిక జీవితంలో వచ్చిన మార్పులతో, రెహమాన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఇలా సడెన్‌గా ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చి ఉండవచ్చనేలా ప్రముఖులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సంగీతం అందించిన ‘ఛావా’ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతోంది. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ విజయంతో బాలీవుడ్‌కు ఈ సినిమా ఊపిరిపోసింది. మరోవైపు టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్‌సి 16’ సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలను ఆయన ఈ సినిమా కోసం కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read- David Warner: బౌండరీ టు బాక్సాఫీస్.. గంగి రెడ్డి ఎట్టున్నది వార్నర్ మామ లుక్!
ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ (AR Rahman Health Bulletin)
తాజా సమాచారం.. ఏఆర్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుపుతూ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఇందులో డీ హైడ్రేషన్ కారణంతోనే ఆయన ఆస్పత్రిలో చేరినట్లుగా తెలిపారు. రొటీన్ చెకప్ అనంతరం ఆయన డిశ్చార్జ్ అయినట్లుగా ఈ బులెటిన్‌లో పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com ఈ లింక్ క్లిక్ చేయగలరు