Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: ఓటమికి బెదరను.. అదరను.. అసలు రహస్యం చెప్పేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఓడినప్పుడు మీసాలు మెలేసిన వారు నేడు తలదించుకొని.. జనసేన ముందు నిలబడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయకేతనం విజయ సభను శుక్రవారం పిఠాపురంలో నిర్వహించారు. ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

జయకేతనం అంటూ నామకరణం చేసిన బహిరంగ సభ వద్ద జన సైనికులను కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఉదయం నుండే పిఠాపురం జనసేన పార్టీ జెండాలతో కళకళలాడగా, సాయంత్రం బహిరంగ సభ సమయానికి జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. పోలీసులు వెంటనే స్పందించి తొక్కిసలాటను నివారించే చర్యలను చేపట్టారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఓడినప్పుడు మీసాలు మెలేసిన వారు నేడు తలదించుకుని.. జనసేన ముందు నిలబడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి రికార్డ్ స్థాయి విజయాన్ని అందించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దయతో తనకు పునర్జన్మ లభించిందన్నారు. బండెనక బండి కట్టి.. తనతో పాటు నడిచిన తెలంగాణ ప్రజలకు కూడా రుణపడి ఉంటానంటూ పవన్ అన్నారు.

వైసీపీని ప్రశ్నించిన జన సైనికులపై ఎన్నో కేసులు పెట్టి వేధించారని గత ప్రభుత్వాన్ని పవన్ విమర్శించారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్ర అయిందని పవన్ అనడంతో సభ ఒక్కసారిగా మారుమ్రోగింది. జనసేన పార్టీకి ఓటమి భయం ఎప్పటికీ ఉండదని, ఓడినా అడుగు ముందుకు వేయడం జనసేన పార్టీ నైజమన్నారు.

ఆ ఉద్దేశంతోనే 2024 ఎన్నికల్లో కూటమిగా ప్రజల ముందుకు వచ్చి వంద శాతం స్ట్రైక్ రేట్ ను జనసేన సాధించిందన్నారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బజార్లలో తిరిగేందుకు కూడా సాహసించలేని పరిస్థితి ఉండేదని, జనసేన పార్టీ వారికి అండగా నిలిచిందన్నారు.

పవన్ తో సినిమా తీస్తున్నా.. బాలినేని
వైసిపి నుండి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన ఆవిర్భావ సభలో సంచలన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ సభా వేదిక పైకి వచ్చిన వెంటనే బాలినేని మాట్లాడుతూ.. తాను పదవులు ఆశించి జనసేన పార్టీలో చేరినట్లు అసత్య ప్రచారాలు చేశారని, జన సైనికుడిగా పవన్ వెంట నడిచేందుకు ఎప్పుడు ముందుంటానన్నారు. ఇక జగన్ పై బాలినేని విరుచుకుపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డు పెట్టుకుని జగన్ నాయకుడిగా ఎదిగారని,  పవన్ కళ్యాణ్ మాత్రం స్వశక్తితో నాయకుడై, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచారని బాలినేని అన్నారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బాలినేని అనగానే సభ చప్పట్లతో మార్మోగింది.

Also Read: Nagababu on YS Jagan: 30 ఏళ్లు నిద్రపోండి.. జగన్ కు నాగబాబు సలహా

అయితే పవన్.. తనతో సినిమా చేయాలని మాత్రమే కోరానని, ఆ మేరకు పవన్ తనకు మాటిచ్చినట్లు బాలినేని చెప్పారు. పవన్ సినిమా గురించి బాలినేని చేసిన కామెంట్స్ పై జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..