Ambati Rambabu
Politics

Ambati Rambabu: పవన్ ప్లీజ్.. ఆ ఒక్క కోరిక తీర్చండి! అంబటి సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu:  జనసేన(Janasena) ఆవిర్భావ వేడుకల వేళ ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం(Deputy Cm) పవన్ కళ్యాణ్(Deputy Cm pawan kalyan) పై వైసీపీ(Ycp) నేత అంబటి రాంబాబు(ambati rambabu) హాట్ కామెంట్స్ చేశారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు చేసిన ఆయన… అనంతరం గుంటూరులో విలేకర్లతో మాట్లాడుతూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి టీడీపీ(Tdp)ని సైతం ఇరకాటంలో నెట్టేవిగా ఉన్నాయి. మరీ ఆ వ్యాఖ్యలెంటీ? ఆ ట్వీటు ఎంటీ? అన్న సంగతి ఓ సారి చూద్దాం.

అంబటి ట్వీట్…కామెంట్స్
ముందుగా గురువారం జనసేన పార్టీని ఉద్దేశించి అంబటి రాంబాబు ‘ఎక్స్’లో ఓ పోస్టు చేశారు. ‘‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.’’ అదీ పోస్ట్. ఈ ట్వీట్ కు సీఎం చంద్రబాబునాయుడు(CM chandrababunaidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ట్యాగ్ చేశారు. అనంతరం గుంటూరు జిల్లా సిద్ధార్థనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కమ్మ, రెడ్లు పాలించారని, ప్రస్తుతం కాపులు పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. ఒక దశలో చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని భావించారని కానీ ప్రజారాజ్యం చివరి వరకు మనుగడ సాగించకపోవడంతో అది సాధ్యం కాదని కామెంట్స్ చేశారు. పవన్ ను పొగుడుతున్నట్లు అనిపిస్తున్న ఈ వ్యాఖ్యల్లో కావలసినంత వెటకారమూ లేకపోలేదు. ఈ వ్యాఖ్యల ద్వారా డిప్యూటీ సీఎంను, జనసేనను ఆకాశానికి ఎత్తేసిన ఆయన తన ప్రధాన ప్రత్యర్థి టీడీపీకి చురకలు అంటించారు. చంద్రబాబును ఇరకాటంలో నెట్టివేసే ప్రయత్నం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడంలో, విమర్శనాస్త్రాలు సంధించడంలో అంబటి రాంబాబుది డిఫరెంట్ స్టైల్. ఇతర నేతల్లా వీరావేశంతో ఊగిపోతూ, ఆగ్రహంతో రగలిపోతూ ఆయన కనిపించరు. స్థిమితంగా మాట్లాడుతూనే విరోధికి సమ్మగా దింపాల్సిన విధంగా దింపుతారు. మిగతా వాళ్లు బూతు మాట్లాడితే అది కొన్ని కొన్ని సార్లు అవతలి వాళ్లకు సానుభూతి వ్యక్తమయ్యే ప్రమాదముంది. కానీ అంబటి ఆ చాన్స్ ఇవ్వడు. తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు.

తాజాగా, ఆయన జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అదే కోవలోకే వస్తాయి.  ఆయన కామెంట్స్ ను పరిశీలిస్తే.. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్ని రెచ్చగొట్టే విధంగాను, టీడీపీ శ్రేణుల్ని ఇబ్బందిపెట్టేలాగాను ఉన్నాయి. జనసేన ఆవిర్భావ ఉత్సవాల వేళ… తెలుగుదేశం అధినాయకత్వానికి అసూయ పుట్టేలా చేయగలిగితే అంతకంటే ప్రత్యర్థికి ఏం కావాలి? బహుశా అదే అంబటి స్ట్రాటజీ కావొచ్చు.

దీనికి నేపథ్యం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, ముక్కసూటి తనం కొన్ని సార్లు కూటమిని ఇబ్బందిపెడ్తున్నాయి. ఇంకోలా మాట్లాడాలంటే సీఎంను డిఫెన్స్ లోకి నెట్టెస్తున్నాయి. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రిని సంప్రదించకుండా ఆయన నిర్ణయాలు ప్రకటించడం తెలుగుదేశం నాయకులకు మింగుడు పడలేదు. చంద్రబాబు కంటే పవన్ పెద్దగా కనిపించారు. అప్పుడే వాళ్లీద్దరికి చెడుతుందేమోనని పలవురు భావించారు. రకరకాల ఊహాగానాలు సైతం వెలువడ్డాయి.

అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాలో లోకేశ్ డిప్యూటీ సీఎం అని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. కొద్దిరోజులు తీవ్రమైన చర్చ కూడా నడిచింది. ఆ పార్టీలో పెరిగిన అభద్రతాభావానికిది ప్రతీక అని కొందరు భావించారు. లోకేశ్ డిప్యూటీ సీఎం అనే ప్రచారాన్ని చంద్రబాబు కూడా ఖండించలేదు. అప్పుడే పవన్ ప్రభుత్వ సమావేశాలకు హాజరుకావాడం లేదంటూ యాత్రలు చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ పవన్ తర్వాత .. భువనేశ్వరి ఏర్పాటు చేసిన కన్సార్ట్ లో పాల్గోనడంతో ఆ రూమర్స్ పక్కకి వెళ్లిపోయాయి.

కానీ, ఎప్పటికైనా పవన్ దూకుడుకి.. చంద్రబాబు సంప్రదాయ ధోరణికి మధ్య ఎప్పుడో ఒక రోజు సంఘర్షణ రాకపోదా, అదీ కూటమిలో చీలికలకు దారి తియ్యకపోదా అని ప్రత్యర్థులు ఎదురుచూస్తున్నారు. అందుకే సందు దొరికినప్పుడల్లా అంబటి లాంటి వాళ్లు రెచ్చగొట్టే ట్వీట్లు , కామెంట్సు చేసి ఆగ్నికి ఆజ్యం పోయడానికి ప్రయత్నాలు చేయడం మాములే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే… కాలక్రమంలోనైనా పవన్ సీఎం అవ్వాలన్న అంబటి కోరిక తీరుతుందేమో చూడాలి.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?